Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ వాలంటైన్స్ డే కానుక

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఈ మూవీ. దీనికి సంబంధించి యూవీ క్రియేషన్స్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. హీరోలంతా తమ కొత్త సినిమాల ఫస్ట్ లుక్స్, టీజర్స్, రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తుంటే.. రాధేశ్యామ్ యూనిట్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ తిట్ల దండకం అందుకున్నారు. మొత్తానికి రాధేశ్యామ్ యూనిట్ లో కదలికి వచ్చింది. ఇప్పటికే […]

ప్రభాస్ వాలంటైన్స్ డే కానుక
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఈ మూవీ.
దీనికి సంబంధించి యూవీ క్రియేషన్స్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. హీరోలంతా తమ కొత్త
సినిమాల ఫస్ట్ లుక్స్, టీజర్స్, రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తుంటే.. రాధేశ్యామ్ యూనిట్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ తిట్ల దండకం అందుకున్నారు. మొత్తానికి రాధేశ్యామ్ యూనిట్ లో కదలికి వచ్చింది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాధేశ్యామ్ యూనిట్, ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి 14న, వాలంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు టీజర్ ఎడిటింగ్ పని మొదలైంది.

అయితే ప్రభాస్ అభిమానుల కోపం మాత్రం చల్లారలేదు. టీజర్ తో పాటు తమకు రిలీజ్ డేట్ కూడా కావాలని వాళ్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. హీరోలంతా మంచి తేదీల్ని ఆక్రమించారని, ఇలాంటి టైమ్ లో మరింత లేటు చేస్తే మొదటికే మోసం వస్తుందని వాళ్ల బాధ.

First Published:  31 Jan 2021 12:41 PM IST
Next Story