Telugu Global
National

తమిళనాడులో కొత్త పార్టీ.. వెనక ఉన్నది రజనీకాంతేనా?

తమిళనాడు రాజకీయాలు ఎవరికీ అంత త్వరగా అర్థం కావు. గత కొన్ని ఏండ్లుగా ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశమంతా ప్రభావితం చేయగలిగినా తమిళనాడులో మాత్రం కనీసం ఒక్క సీటు కోసం అక్కడి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ల రాజకీయాలు చాన్నాళ్లు నడిచాయి. అప్పుడే ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వాళ్లు రాజకీయాలను ఏలారు. వాళ్లు స్థాపించిన పార్టీలే ఇప్పటికీ తమిళనాడు […]

తమిళనాడులో కొత్త పార్టీ.. వెనక ఉన్నది రజనీకాంతేనా?
X

తమిళనాడు రాజకీయాలు ఎవరికీ అంత త్వరగా అర్థం కావు. గత కొన్ని ఏండ్లుగా ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశమంతా ప్రభావితం చేయగలిగినా తమిళనాడులో మాత్రం కనీసం ఒక్క సీటు కోసం అక్కడి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తమిళనాడులో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ల రాజకీయాలు చాన్నాళ్లు నడిచాయి. అప్పుడే ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వాళ్లు రాజకీయాలను ఏలారు. వాళ్లు స్థాపించిన పార్టీలే ఇప్పటికీ తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. అక్కడ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు తప్ప మరో పార్టీకి చోటు లేకుండా పోయింది. ఈ రెండు పార్టీల నడుమ జరిగే పోరాటంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐలకు కూడా చోటు ఉండదు.

గతంలో తమిళ రాజకీయాల్లో సినీనటుల ప్రాభవాన్ని చూసిన కమలహాసన్ ఒక పార్టీని స్థాపించి ముందుకు వెళ్లినా.. పెద్దగా రాణించలేక పోయారు. అదే సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని పలుమార్లు ప్రకటనలు వెలువడ్డాయి. స్వయంగా సూపర్ స్టార్ రజనీయే పార్టీ పెట్టబోతున్నట్లు సన్నిహితులకు చెప్పారు.

రజనీకాంత్ పార్టీ పెట్టడానికి అన్ని రకాలుగా సిద్దం చేసుకున్న తర్వాత చెన్నైలో ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఆ కార్యాలయంలో రజనీ సన్నిహితుడు, అంతకు ముందు బీజేపీలో కీలక వ్యక్తి అయిన అర్జునమూర్తిని కోఆర్డినేటర్‌గా నియమించారు. రజనీ పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు.

రజనీ మరో వారంలో పార్టీ ప్రకటన చేయాల్సిన సమయంలో అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు ఈ సమయంలో బయట తిరగడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది. అదే సమయం రజని స్నేహితుడు పార్టీ పెట్టడానికి సన్నద్దమయ్యారు. ఈ విషయాన్ని రజనీకి చెప్పగా ఆయన కూడా పార్టీకి అవసరమైన సాయం చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలోనే పోయెస్ గార్డెన్‌లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్జున మూర్తి పార్టీ ప్రకటన చేస్తారని తెలుస్తున్నది.

First Published:  30 Jan 2021 7:27 AM IST
Next Story