ఆగస్ట్ 19న మహాసముద్రం
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మహాసముద్రం’ ఆగస్ట్ 19న విడుదల కానున్నది. అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాకతో ఆగస్ట్ బాక్సాఫీస్ నిండిపోయింది. ఎందుకంటే, ఇప్పటికే ఆగస్ట్ బాక్సాఫీస్ బరిలో పుష్ప, ఎఫ్3 సినిమాలున్నాయి. ఇప్పుడు మహాసముద్రం మరో వారాన్ని ఆక్రమించింది. సో.. ఈ ఏడాది ఆగస్ట్ లో వారానికో బిగ్ మూవీ చూడబోతున్నారు […]
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మహాసముద్రం’ ఆగస్ట్ 19న
విడుదల కానున్నది. అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఎ.కె.
ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రాకతో ఆగస్ట్ బాక్సాఫీస్ నిండిపోయింది. ఎందుకంటే, ఇప్పటికే ఆగస్ట్ బాక్సాఫీస్ బరిలో పుష్ప,
ఎఫ్3 సినిమాలున్నాయి. ఇప్పుడు మహాసముద్రం మరో వారాన్ని ఆక్రమించింది. సో.. ఈ ఏడాది ఆగస్ట్ లో
వారానికో బిగ్ మూవీ చూడబోతున్నారు ఆడియన్స్.
ఎమోషనల్-యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది మహాసముద్రం సినిమా. ఆర్ఎక్స్-100
సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి, తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాను
తెరకెక్కిస్తున్నాడు. చైతన్ భరధ్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.