Telugu Global
NEWS

ఏపీలో తొలిరోజు 1315 సర్పంచ్‌ నామినేషన్లు !

ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. పల్లెల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తొలి రోజు సర్పంచ్‌లకు 1315 నామినేషన్లు వేశారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 248 నామినేషన్లు సమర్పించారు. ఏపీ వ్యాప్తంగా వార్డుమెంబర్లకు 2200 నామినేషన్లు తొలి రోజు వచ్చాయి. విజయనగరం జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు లేవు. దీంతో అక్కడ ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. జిల్లాల వారీగా సర్పంచ్‌ నామినేషన్ల లిస్ట్‌ చూస్తే…. అనంతపురం – 77 చిత్తూరు – 157 తూర్పుగోదావరి […]

ఏపీలో తొలిరోజు 1315 సర్పంచ్‌ నామినేషన్లు !
X

ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. పల్లెల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తొలి రోజు సర్పంచ్‌లకు 1315 నామినేషన్లు వేశారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 248 నామినేషన్లు సమర్పించారు. ఏపీ వ్యాప్తంగా వార్డుమెంబర్లకు 2200 నామినేషన్లు తొలి రోజు వచ్చాయి. విజయనగరం జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు లేవు. దీంతో అక్కడ ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.
జిల్లాల వారీగా సర్పంచ్‌ నామినేషన్ల లిస్ట్‌ చూస్తే….

అనంతపురం – 77
చిత్తూరు – 157
తూర్పుగోదావరి – 248
గుంటూరు- 127
కడప- 73
కృష్ణా- 63
కర్నూలు – 85
నెల్లూరు – 27
ప్రకాశం- 41
శ్రీకాకుళం – 141
విశాఖపట్నం- 194
పశ్చిమగోదావరి- 82

నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజుల గడువు ఉంది. శుక్రవారం మంచిరోజు కావడంతో చాలా మంది నామినేషన్లు వేసినట్లు తెలిసింది.

రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ పర్యటించారు. తనపై కామెంట్స్‌ చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తీరు బాగోలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇటు సజ్జల, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ చంద్రముఖిలా మారిన ఆయనలోకి చంద్రబాబు ప్రవేశించారని ఆక్షేపించారు. ఆయన వ్యవహార శైలి బాగోలేదని విమర్శించారు.

First Published:  30 Jan 2021 2:15 AM IST
Next Story