Telugu Global
Cinema & Entertainment

నారప్ప కూడా వచ్చేస్తున్నాడు

ఎట్టకేలకు నారప్ప రెడీ అయ్యాడు. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మొత్తానికి ఓ కొలిక్కి వస్తోంది. దీంతో రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సమ్మర్ స్పెషల్ గా మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది నారప్ప. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నారప్ప గా విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నాడు. ఆయన భార్య సుందరమ్మగా ప్రియమణి కనిపించనుంది. ఈ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా వీళ్లు కనిపించబోతున్నారు. […]

narappa-may-14-release
X

ఎట్టకేలకు నారప్ప రెడీ అయ్యాడు. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మొత్తానికి ఓ కొలిక్కి వస్తోంది. దీంతో రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సమ్మర్ స్పెషల్ గా మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది నారప్ప.

సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నారప్ప గా విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నాడు. ఆయన భార్య సుందరమ్మగా ప్రియమణి కనిపించనుంది. ఈ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా వీళ్లు కనిపించబోతున్నారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మోస్ట్ ఎమోషనల్ గా తెరకెక్కుతోంది నారప్ప మూవీ. ప్రస్తుతం మూవీ చివరి షెడ్యూల్ లో ఉంది. మరో 2 రోజుల్లో టోటల్ షూట్ పూర్తవుతుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  29 Jan 2021 1:40 PM IST
Next Story