Telugu Global
Others

మహారాష్ట్రకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్న మేఘా..

ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామిగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో కీలకమైన ఆర్డర్ దక్కించుకుంది. పుణె మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ ఆర్డర్ దక్కించుకుంది. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశలో కేంద్ర ప్రభుత్వ ఫేమ్ – 2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేస్తుంది. గ్రాస్ కాస్ట్ […]

మహారాష్ట్రకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్న మేఘా..
X

ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామిగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో కీలకమైన ఆర్డర్ దక్కించుకుంది. పుణె మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ ఆర్డర్ దక్కించుకుంది. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశలో కేంద్ర ప్రభుత్వ ఫేమ్ – 2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేస్తుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) / ఓపెక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు ఈ 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా చేపడుతుంది. ఈవీ ట్రాన్స్ ఈ 350 ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుండి కొనుగోలు చేస్తుంది. 7నెల వ్యవధిలో 350 బస్సులను ఒలెక్ట్రా సంస్థ అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్ట్ కాలంలో ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా ఈవీ ట్రాన్స్ పరిధిలోనే ఉంటుంది. ఈ 350 బస్సులతోపాటు దేశవ్యాప్తంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ 1250 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేస్తోంది.

బీఎంటీసీ బిడ్డింగ్ లో ఎల్-1 గా నిలిచిన ఒలెక్ట్రా

గ్రీన్ సిటీ బెంగళూరుకు సైతం 300 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయడానికి పిలిచిన టెండర్లలో ఒలెక్ట్రా సంస్థ ఎల్-1 గా నిలవడం విశేషం. ఫేమ్ – 2 పథకంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (బీఎంటీసీ) 300 విద్యుత్ బస్సులకు గాను నిర్వహించిన టెండర్ ప్రక్రియలో అతి తక్కువగా బిడ్డింగ్ కోట్ చేసి ఎల్-1 గా నిలిచింది ఒలెక్ట్రా. ఈ 300 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) / ఓపెక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపడుతుంది. ఈవీ ట్రాన్స్ కి 300 బస్సుల సరఫరాకు అనుమతి లభించిన వెంటనే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి 12 నెలల కాలంలో బస్సులు సమకూర్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పుణె మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ నుండి 350 ఎలెక్ట్రిక్ బస్సుల ఆర్డర్ దక్కించుకున్న సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) సీఈఓ & సీఎఫ్ఓ శరత్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఈవీ ట్రాన్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే పుణేలో 300 ఎలెక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని ఈ కొత్త బస్సుల రాకతో ఈ సంఖ్య 650 లకు చేరిందని అన్నారు. దేశంలోని ఒక రాష్ట్రంలో అత్యధికంగా బస్సులను సరఫరా చేసిన ఘనత ఒలెక్ట్రాకే చెందుతుందని తెలిపారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒలెక్ట్రా బస్సులు నడుస్తున్నాయి. 13,000 అడుగుల (962.4 మీటర్ల) ఎత్తున ఉన్న రోహ్ తంగ్ పాస్ వరకు ప్రయాణం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది ఒలెక్ట్రా.

ఒలెక్ట్రా బస్సు ప్రత్యేకతలు ఇవీ..

– 12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 33 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం ఉంది.
– వీల్ చెయిర్ సదుపాయం
– ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ సస్పెన్షన్ తో ప్రయాణం సౌకర్యవంతం
– ప్రయాణికుల రక్షణ కోసం బస్సులో సీసీ కెమెరాలు
– వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్
– బ్యాటరీని ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం
– రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో బ్రేక్ వేసిన ప్రతిసారీ చార్జింగ్
– అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా 2 నుంచి 5 గంటల్లోనే పూర్తి చార్జింగ్..

First Published:  29 Jan 2021 1:37 PM IST
Next Story