Telugu Global
Cinema & Entertainment

మరోసారి సంక్రాంతిపై కన్నేసిన మహేష్

గతేడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు మహేష్. వస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఇప్పుడు మరోసారి సంక్రాంతిపై కన్నేశాడు. తన అప్ కమింగ్ మూవీని కూడా పొంగల్ కే తీసుకొస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటన […]

మరోసారి సంక్రాంతిపై కన్నేసిన మహేష్
X

గతేడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు మహేష్. వస్తూనే బ్లాక్ బస్టర్
హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఇప్పుడు మరోసారి సంక్రాంతిపై కన్నేశాడు. తన అప్
కమింగ్ మూవీని కూడా పొంగల్ కే తీసుకొస్తున్నాడు.

పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్
పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ
మేరకు ఈరోజు అధికారిక ప్రకటన వచ్చేసింది.

నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అంతలోనే ఆగస్ట్ కు పుష్ప
సినిమా కర్చీఫ్ వేసింది. ఆ వెంటనే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే
సంక్రాంతిని లాక్ చేశారు.

ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది.
మహేష్, కీర్తిసురేష్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో ఓ భారీ సెట్
నిర్మాణం జరుగుతోంది. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, హైదరాబాద్ లోని ఆ భారీ సెట్ లో
సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుంది.

First Published:  29 Jan 2021 1:50 PM IST
Next Story