ఆటాడేస్తున్న హీరోలు.. టాలీవుడ్ నయా ట్రెండ్
టాలీవుడ్‌లో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అప్పట్లో ఫ్యామీలీ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఆ తర్వాత మగధీర నుంచి పీరియాడిక్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మగధీర, రుద్రమదేవి, బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ని, సైరా ఇలా మొన్నటి వరకూ ఈ ట్రెండ్ నడిచింది. అయితే ఇప్పుడొస్తున్న కుర్ర హీరోలు మరో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. అదే స్పోర్ట్స్ జానర్ ఫిల్మ్స్. జెర్సీతో నాని అందర్నీ బాగా కనెక్ట్ చేశాడు. స్పోర్ట్స్ కాన్సెప్ట్స్.. తెలుగులో […]
టాలీవుడ్‌లో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అప్పట్లో ఫ్యామీలీ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఆ తర్వాత మగధీర నుంచి పీరియాడిక్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మగధీర, రుద్రమదేవి, బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ని, సైరా ఇలా మొన్నటి వరకూ ఈ ట్రెండ్ నడిచింది. అయితే ఇప్పుడొస్తున్న కుర్ర హీరోలు మరో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. అదే స్పోర్ట్స్ జానర్ ఫిల్మ్స్.
జెర్సీతో నాని అందర్నీ బాగా కనెక్ట్ చేశాడు. స్పోర్ట్స్ కాన్సెప్ట్స్.. తెలుగులో బాగానే వర్కవుట్ అవుతాయి. కబడ్డీ, బాక్సింగ్, క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన చాలా సినిమాలు మన తెలుగులో బాగానే అడాయి. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత తెలుగులో వరుసగా స్పోర్ట్స్ మూవీస్ కనిపిస్తున్నాయి. ఎవరికి నచ్చిన స్పోర్ట్‌ని వాళ్లు సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ మీద రీల్ గేమ్ ఆడేందుకు రెడీ అయ్యారు.
మార్షల్ ఆర్ట్సిస్ట్ లైగర్.
స్పోర్ట్స్ మూవీస్ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ ముందున్నాడు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న లైగర్ మూవీ ఇప్పటికే అంచనాలు క్రియేట్ చేసింది. ఇలాంటి సబ్జెక్ట్స్‌ను డీల్ చేయడం పూరీకి కొత్తేమీ కాదు. గతంలో అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో బాక్సింగ్ చుట్టూ తిరిగే కథకు ప్రేక్షకులు ఎంతబాగా కనెక్ట్ అయ్యారో మనకు తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత స్పోర్ట్స్ సబ్జెక్ట్ తీసుకున్న పూరి.. ఎనర్జిటిక్ విజయ్‌తో ఎలా అదరగొడతాడో చూడాలి.
హాకీ ఎక్స్‌ప్రెస్
అప్పుడెప్పుడో చక్ దే ఇండియా తర్వాత హాకీ గేమ్ అంతగా సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు రీసెంట్ గా తెలుగుకి హాకీని పరిచయం చేయడానికి రెడీ అయ్యాడు సందీప్ కిషన్. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా హాకీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న సినిమా ఎ 1 ఎక్స్‌ప్రెస్. ఈ సినిమాకు జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
కూతకు రెడీ
మన తెలుగు వాళ్లకు కబడ్డీతో ఉన్న రిలేషన్ అంతా ఇంతా కాదు. పల్లెటూరి నుంచి ప్రో కబడ్డీ లీగ్ వరకూ అన్ని ఫార్మాట్‌ల్లో ఈ ఆట మంచి కిక్ నిస్తుంది. ఇలాంటి కబడ్డి బ్యాక్ డ్రాప్‌ను తీసుకుని గోపీచంద్.. సీటీ మార్ అంటున్నాడు. సంపత్ నంది డైరెక్షన్లో గోపీచంద్ , తమన్నా, కబడ్డీ కోచ్‌లుగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే కూతకు రెడీ అవుతోంది.
బాక్సర్ ‘గని’
రియల్ గానే కాదు స్క్రీన్ మీద కూడా మంచి ఇంట్రెస్టింగ్‌గా సాగే బాక్సింగ్ గేమ్ తో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా రెడీ అయ్యాడు. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘గని’ మూవీకి సంబంధించిన పోస్టర్‌లో బాక్సర్‌గా వరుణ్ లుక్ బాగుంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఇంగ్లండ్ బాక్సర్ డేవిడ్ టోనీ జెఫ్రిస్ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు.
శౌర్య టార్గెట్ ఫిక్స్
ఇప్పటివరకూ మనకు అంతగా పరిచయం లేని గేమ్‌తో యంగ్ హీరో నాగశౌర్య రెడీ అయ్యాడు. ఇప్పటి వరకూ టచ్ చెయ్యని ఆర్చరీ గేమ్‌ను తెరమీదకి తీసుకొస్తున్నాడు. ఆర్చరీ నేపథ్యంలో వస్తున్న ‘లక్ష్య’ సినిమా కోసం శౌర్య.. సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధమయ్యాడు. సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
రన్నర్‌గా ఆది
ఆది పినిశెట్టి అథ్లెట్‌గా తెరకెక్కుతున్న మరో సినిమా క్లాప్. పృథ్వీ ఆదిత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆది 400 మీటర్ల స్ప్రింట్ రన్నర్‌గా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు.
రేస్‌కు రెడీ
ఇక వీటితో పాటు వెంకటేష్, తరుణ్ భాస్కర్ కాంబోలో కూడా ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ రాబోతోంది. హార్స్ రేసింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా గురించి అంతగా అప్ డేట్స్ రాకపోయినా మూవీ మాత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.