Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి ఆచార్య టీజర్ రివ్యూ

‘ఆచార్య దేవో భవ’ అని మన అందరికీ తెలిసిందే.. కానీ ‘ఆచార్య రక్షోభవ’ అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. అసలు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు. అనే విషయం తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్‌. ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. టీజర్‌కు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ను అందించారు. ఆచార్య పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి, సిద్ధ అనే మరో పవర్‌ఫుల్‌ పాత్రలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ […]

చిరంజీవి ఆచార్య టీజర్ రివ్యూ
X

‘ఆచార్య దేవో భవ’ అని మన అందరికీ తెలిసిందే.. కానీ ‘ఆచార్య రక్షోభవ’ అని అంటున్నారు మెగాస్టార్‌
చిరంజీవి. అసలు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు. అనే
విషయం తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్‌.

ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. టీజర్‌కు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ను
అందించారు. ఆచార్య పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి, సిద్ధ అనే మరో పవర్‌ఫుల్‌ పాత్రలో మెగాపవర్‌స్టార్‌
రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో
ఆసక్తి పెరిగింది. ఇక చిరంజీవి, చరణ్‌ కాంబినేషన్‌ను వెండితెరపై వీక్షించడానికి మెగాభిమానులు సంగతి
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

టీజర్ లో చిరంజీవి మోస్ట్ ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. అతడు చెప్పిన డైలాగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా
నిలిచింది. టీజర్ కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ చాలా బాగున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వం
వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి,
రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్నాడు ఆచార్య.

First Published:  29 Jan 2021 1:46 PM IST
Next Story