రైతులపై మరోసారి విరిగిన లాఠీ.. ఢిల్లీ-ఛండీగఢ్ మార్గంలో టెన్షన్.. !
జనవరి 26న ఢిల్లీలో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. రైతులు ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళన నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాయి. మరోవైపు ఢిల్లీలో జరిగిన ఘటనపై పోలీసులు, ఎన్ఐఏ బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ - ఛండీగఢ్ మార్గంలో శుక్రవారం టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అయితే ఇక్కడ రైతుల నిరసన కొనసాగుతున్న […]
జనవరి 26న ఢిల్లీలో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. రైతులు ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళన నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాయి. మరోవైపు ఢిల్లీలో జరిగిన ఘటనపై పోలీసులు, ఎన్ఐఏ బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయి.
ఇదిలా ఉండగా ఢిల్లీ - ఛండీగఢ్ మార్గంలో శుక్రవారం టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అయితే ఇక్కడ రైతుల నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో స్థానిక పోలీసులు వారిని అడ్డగించేందుకు యత్నించినప్పటికీ రైతులు శాంతించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.అయితే ఇప్పటికి కూడా సింఘూ సరిహద్దులో పరిస్థితులు అదుపులో రాన్నట్టు సమాచారం. రాళ్లదాడిలో కొందరు పోలీసులు గాయపడగా వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవాళ ఏం జరిగిందంటే..
సింఘూ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇవాళ కొందరు స్థానికులు ఆందోళన ఆపేయాలని.. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని రైతులను కోరారు. దీంతో స్థానికులకు, రైతుసంఘాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేసేందుకు యత్నించారు. గుర్తుతెలియని దుండగులు పోలీసులపై దాడి చేయడంతో.. పోలీసులు లాఠీచార్జ్ జరిపారు.