Telugu Global
National

తమిళనాడులో మళ్లీ శశికళ చక్రం తిప్పుతుందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు. 48 నెలల పాటు జైలులో ఉండాల్సిన శశికళ.. ఐదు నెలల ముందే బయటకు వచ్చారు. ఎన్నికల్లో ఆమె చక్రం తిప్పడానికే బయటకు వచ్చారా? అనే చర్చ నడుస్తోంది. బీజేపీతో మేనల్లుడు టీటీవీ దినకరన్‌ కుదర్చుకున్న ఒప్పందం ప్రకారమే శశికళ బయటకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకేతో అలయెన్స్‌ కుదర్చుకుని […]

తమిళనాడులో మళ్లీ శశికళ చక్రం తిప్పుతుందా?
X

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు. 48 నెలల పాటు జైలులో ఉండాల్సిన శశికళ.. ఐదు నెలల ముందే బయటకు వచ్చారు. ఎన్నికల్లో ఆమె చక్రం తిప్పడానికే బయటకు వచ్చారా? అనే చర్చ నడుస్తోంది.

బీజేపీతో మేనల్లుడు టీటీవీ దినకరన్‌ కుదర్చుకున్న ఒప్పందం ప్రకారమే శశికళ బయటకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకేతో అలయెన్స్‌ కుదర్చుకుని ముందుకు సాగతారని ఊహగానాలు విన్పిస్తున్నాయి. లేకపోతే బీజేపీతో కలిసి పోటీ చేస్తారని మరో గుసగుస విన్పిస్తోంది.

అన్నాడీఏంకే గుర్తు రెండు ఆకుల గుర్తు గురించి శశికళ వేసిన పిటీషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇలాంటి టైమ్‌లో ఆమె వేరే పార్టీ తరపున ప్రచారం చేస్తే ఆమె శాశ్వతంగా అన్నాడీఎంకే దూరమవుతారు. జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఆమె ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేదు. దీంతో ఆమె ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డాతో దినకరన్ ఒప్పందం కుదుర్చుకున్నారనేది చెన్నైలో వినిపిస్తున్న మాట. అందులో భాగంగానే అన్నాడీఎంకే కూటమికి మేలు జరిగే విధంగా శశికళ వ్యవహరిస్తారని తెలుస్తోంది. మొత్తానికి మరో వారం రోజుల్లో శశికళ ఏ స్టెప్‌ తీసుకుంటారనే విషయంపై ఓక్లారిటీ వస్తుంది.

First Published:  28 Jan 2021 2:14 AM IST
Next Story