ట్వీట్ ఎఫెక్ట్ ! జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌పై యాక్షన్ !
ఇండియా టుడే కన్సెల్టింగ్ ఎడిటర్, ప్రముఖ యాంకర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌పై వేటు పడింది. రెండు వారాల పాటు ఇండియా టుడే చానల్‌లో కనిపించకుండా యజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నెలరోజుల జీతం కూడా కోత విధించినట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ డే రోజు రైతుల పరేడ్‌లో ట్రాక్టర్‌బోల్తా పడి ఓ రైతు మృతిచెందారు. అయితే పోలీసుల కాల్పుల్లో రైతు మృతి చెందాడని రాజ్ దీప్ ట్వీట్ చేశారు. పోలీసులు కాల్చడం వల్లే ట్రాక్టర్ అదుపుతప్పి పడిందని రైతులు […]
ఇండియా టుడే కన్సెల్టింగ్ ఎడిటర్, ప్రముఖ యాంకర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌పై వేటు పడింది. రెండు వారాల పాటు ఇండియా టుడే చానల్‌లో కనిపించకుండా యజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నెలరోజుల జీతం కూడా కోత విధించినట్లు తెలుస్తోంది.
రిపబ్లిక్ డే రోజు రైతుల పరేడ్‌లో ట్రాక్టర్‌బోల్తా పడి ఓ రైతు మృతిచెందారు. అయితే పోలీసుల కాల్పుల్లో రైతు మృతి చెందాడని రాజ్ దీప్ ట్వీట్ చేశారు. పోలీసులు కాల్చడం వల్లే ట్రాక్టర్ అదుపుతప్పి పడిందని రైతులు తనతో చెప్పారని.. ఈ త్యాగం వృథాగా పోదు అని పోస్టు పెట్టాడు. అయితే ఆ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేశాడు.
ఢిల్లీ పోలీసులు మాత్రం నవనీత్ అనే రైతు ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడని, ఎటువంటి కాల్పులు జరగలేదని వివరణ ఇచ్చారు. అయితే ఇతర నిరసనకారులు పోలీసు కాల్పుల్లో మృతిచెందాడని ఆరోపించారు. పోలీసులు ఆ తర్వాత ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బారికేడ్లపై రైతు ట్రాక్టర్‌తో దూసుకొచ్చాడు. అక్కడ కంట్రోల్ తప్పడంతో ట్రాక్టర్ తిరిగి పడింది. దీంతో అతను మృతిచెందాడని పోలీసులు తేల్చారు.
తప్పుడు వార్తను ట్వీట్ చేసిన రాజ్‌దీప్‌పై చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. అంతేకాదు అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరాయి. రాజ్‌దీప్ మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. అయితే నిరసనకారులు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారని ఆరోపించారు. కానీ వీడియోలో మాత్రం ట్రాక్టర్ అదుపుతప్పడం వల్లే నవనీత్ చనిపోయాడని తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు ఏం తేలుస్తుందో చూడాలి. నిరసనకారుల ఆరోపణల్లో నిజం లేదు అంటూ మరో ట్వీట్ చేశాడు.