ఉక్కిరిబిక్కిరి చేసిన పుష్ప
వరుస అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప సినిమాకు సంబంధించి ఏదీ దాచుకోకుండా.. బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తున్నాడు. ఇదే ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు ఏకంగా రిలీజ్ డేట్ ప్రకటించి, అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. ఆగస్ట్ 13న పుష్ప సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు బన్నీ. ఈ సందర్భంగా సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశాడు. అలావైకుఠపురంలో లాంటి ఇండస్ట్రి […]
వరుస అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప సినిమాకు సంబంధించి ఏదీ దాచుకోకుండా.. బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తున్నాడు. ఇదే ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు ఏకంగా రిలీజ్ డేట్ ప్రకటించి, అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు.
ఆగస్ట్ 13న పుష్ప సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు బన్నీ. ఈ సందర్భంగా సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశాడు.
అలావైకుఠపురంలో లాంటి ఇండస్ట్రి హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్నారు.
రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.