Telugu Global
NEWS

మాకో అభ్యర్థి కావాలి ! గులాబీ, కమలానికి సాగర్‌ పరీక్ష !

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతుంది. వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడుదల కాబోతుంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి అని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ జానారెడ్డి మాత్రం ఇంకా బయటపడలేదు. తాను బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? తన కొడుకు రఘువీర్‌రెడ్డిని పోటీలోకి దించితే పరిస్థితి ఏంటి? అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ క్యాండేట్‌ను బట్టి జానారెడ్డి పోటీలో […]

మాకో అభ్యర్థి కావాలి ! గులాబీ, కమలానికి సాగర్‌ పరీక్ష !
X

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతుంది. వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడుదల కాబోతుంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి అని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ జానారెడ్డి మాత్రం ఇంకా బయటపడలేదు. తాను బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? తన కొడుకు రఘువీర్‌రెడ్డిని పోటీలోకి దించితే పరిస్థితి ఏంటి? అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ క్యాండేట్‌ను బట్టి జానారెడ్డి పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఆయన సీనియార్టీకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుతున్నారని జానా సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఓ వైపు తండ్రి.. మరో వైపు కొడుకు నియోజకవర్గాన్ని జల్లెడ పడుతున్నారు. చివరి నిమిషంలో రాజకీయంగా ఎలాంటి సమస్య రావొద్దని జానారెడ్డి గ్రౌండ్‌ వర్క్‌బలంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది,

మరోవైపు జానారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఇంద్రసేనారెడ్డి బీజేపీలో చేరారు. ఈయనతో పాటు తిరుమలగిరి సాగర్‌ మండలానికి చెందిన డాక్టర్‌ రవినాయక్‌ కూడా కమలం కండువా కప్పుకున్నారు. అయితే బీజేపీ తరపున ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని బరిలోకి దింపాలని ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. అయితే తాను పార్టీ మారేది లేదని.. బీజేపీ నేతలు తనతో సంప్రదింపులు జరపలేదని ఆయన ప్రకటన విడుదల చేశారు.

మొత్తానికి అధికార పార్టీకి సామాజిక, స్థానిక సమీకరణాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. గ్రూప్ పాలిటిక్స్‌ కూడా ఓ సమస్యగా మారాయి. సాగర్‌ అభ్యర్థి ఎంపిక నిజంగానే పరీక్షగామారింది. ఇటు బీజేపీ మాత్రం టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాని నేతలను తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్‌ చేస్తోంది. మరీ వారి పాచిక పారుతుందో లేదో చూడాలి. దుబ్బాక, జీహెచ్ఎంసీతర్వాత అదే ఊపును కొనసాగించాలంటే బలమైన అభ్యర్థి కావాలి. ఆ క్యాండేట్‌ కోసమే ఇప్పుడు కమలం సెర్చ్‌ చేస్తోంది.

First Published:  28 Jan 2021 6:26 PM IST
Next Story