ఎవరీ దీప్ సిద్దూ ?
వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా నిన్న ఢిల్లీలో జరిగిన అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీ హింసాత్మకంగా మారింది. అసాంఘిక శక్తులు ర్యాలీలోకి చొరబడ్డాయని.. వాళ్లే రైతుల ట్రాక్టర్ ర్యాలీని దారి మళ్లించి ఎర్రకోట వైపు తీసుకెళ్లారని ఏకంగా రైతు సంఘాలే ఆరోపిస్తున్నాయి. నిన్న జరిగిన అల్లర్లలో ‘దీప్ సిద్దూ’ అనే పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. అతడే రైతన్నలను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు దీప్ సిద్దూకు రైతుసంఘాలకు […]
వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా నిన్న ఢిల్లీలో జరిగిన అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీ హింసాత్మకంగా మారింది. అసాంఘిక శక్తులు ర్యాలీలోకి చొరబడ్డాయని.. వాళ్లే రైతుల ట్రాక్టర్ ర్యాలీని దారి మళ్లించి ఎర్రకోట వైపు తీసుకెళ్లారని ఏకంగా రైతు సంఘాలే ఆరోపిస్తున్నాయి. నిన్న జరిగిన అల్లర్లలో ‘దీప్ సిద్దూ’ అనే పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. అతడే రైతన్నలను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు దీప్ సిద్దూకు రైతుసంఘాలకు ఎటువంటి సంబంధం లేదని.. అతడు బీజేపీ కార్యకర్త అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు 2019 ఎన్నికల సమయంలో దీప్ సిద్దూ ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఉన్నో ఫొటో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నది. అయితే ఈ ఫొటోను ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం గమనార్హం. అయితే ఇప్పుడు దీప్ సిద్దూ ఎవరూ? అన్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
పంజాబ్‌కు చెందిన దీప్ సిద్దూ సింగర్. పలు హిందీ పంజాబీ కూడా సినిమాల్లో నటించాడు. అయితే సిద్దూ మొదటి నుంచి రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. మరోవైపు నిన్న ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీకి ముందు సిద్దూ సోషల్‌మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో సిద్దూ రైతులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు ఎర్రకోటమీదకు వెళ్లి ‘నిశాన్ సాహిబ్’ జెండాలను ఎగరేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో సిద్దూ అక్కడే ఉన్నారు.
అయితే ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పందిస్తూ.. ‘దీప్ సిద్దూ అస్సలు సిక్కు కాదు. అతడికి రైతు ఉద్యమంతో ఏ విధమైన సంబంధం లేదు. అతడు బీజేపీ కార్యకర్త. ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకే అతడు ఆందోళనలోకి వచ్చాడు’ అంటూ ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది.