Telugu Global
Cinema & Entertainment

నిద్రలేని రాత్రులు గడిపిన సమంత

విమర్శలు ఎవరినైనా నొప్పిస్తాయి. బాధకు గురిచేస్తాయి. నిద్రలేని రాత్రుల్ని రుచిచూపిస్తాయి. హీరోయిన్ సమంతకు కూడా అలాంటి నిద్రలేని రాత్రులు ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో తనపై జరిగిన ట్రోలింగ్ గురించి చెప్పుకొచ్చింది సమంత. ఒక దశలో కొన్ని ట్రోల్స్ చూసి తనకు నిద్ర కూడా పట్టేది కాదని చెప్పుకొచ్చింది. అయితే అదంతా గతం అంటోంది సమంత. ఇప్పుడు తనపై వస్తున్న ట్రోల్స్ చూసి నవ్వుకుంటానని చెబుతోంది. ట్రోల్స్ ను అస్సలు పట్టించుకోనని చెబుతున్న సమంత.. తను ఎదిగానని చెప్పడానికి […]

నిద్రలేని రాత్రులు గడిపిన సమంత
X

విమర్శలు ఎవరినైనా నొప్పిస్తాయి. బాధకు గురిచేస్తాయి. నిద్రలేని రాత్రుల్ని రుచిచూపిస్తాయి. హీరోయిన్
సమంతకు కూడా అలాంటి నిద్రలేని రాత్రులు ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో తనపై జరిగిన ట్రోలింగ్
గురించి చెప్పుకొచ్చింది సమంత. ఒక దశలో కొన్ని ట్రోల్స్ చూసి తనకు నిద్ర కూడా పట్టేది కాదని
చెప్పుకొచ్చింది.

అయితే అదంతా గతం అంటోంది సమంత. ఇప్పుడు తనపై వస్తున్న ట్రోల్స్ చూసి నవ్వుకుంటానని
చెబుతోంది. ట్రోల్స్ ను అస్సలు పట్టించుకోనని చెబుతున్న సమంత.. తను ఎదిగానని చెప్పడానికి ఇదే
పెద్ద ఉదాహరణ అంటోంది.

కొత్త ఏడాదిలో కొత్తగా ఎలాంటి తీర్మానాలు చేసుకోలేదని చెప్పిన ఈ బ్యూటీ.. 2021లో కూడా శాకాహారిగానే
ఉంటానని, యోగా చేస్తూ ఆనందంగా ఉండాలని తీర్మానించుకున్నట్టు చెబుతోంది. అయితే ఎక్కువ
సినిమాలు చేస్తానని మాత్రం చెప్పలేదు సమంత.

First Published:  27 Jan 2021 11:06 AM IST
Next Story