ఇది మంచి చేసే బ్యాక్టీరియా
మన శరీరంలో చెడుచేసే బ్యాక్టీరియా మాత్రమే కాదు. మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి. వీటినే ప్రోబ్యాక్టీరియా లేదా ప్రోబయాటిక్స్ అంటారు. అలర్జీల నుంచి గుండెజబ్బుల దాకా.. చాలా రకాల సమస్యల నుంచి బయటపడటానికి ఇవి మెడిసిన్‌లా ఉపయోగపడతాయి. ప్రోబయాటిక్స్ పోషకాలు కాదు. ఇవి కూడా బ్యాక్టీరియానే. కానీ ఇవి మంచి చేసే బ్యాక్టీరియా. ముఖ్యంగా మన జీర్ణక్రియను మెరుగుపరిచే పేగుల్లోని బ్యాక్టీరియా. పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోస ఇవన్నీ ఇలాంటివి. ఇవి డిప్రెషన్ లాంటి మానసిక […]
మన శరీరంలో చెడుచేసే బ్యాక్టీరియా మాత్రమే కాదు. మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి. వీటినే ప్రోబ్యాక్టీరియా లేదా ప్రోబయాటిక్స్ అంటారు. అలర్జీల నుంచి గుండెజబ్బుల దాకా.. చాలా రకాల సమస్యల నుంచి బయటపడటానికి ఇవి మెడిసిన్‌లా ఉపయోగపడతాయి.
ప్రోబయాటిక్స్ పోషకాలు కాదు. ఇవి కూడా బ్యాక్టీరియానే. కానీ ఇవి మంచి చేసే బ్యాక్టీరియా. ముఖ్యంగా మన జీర్ణక్రియను మెరుగుపరిచే పేగుల్లోని బ్యాక్టీరియా. పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోస ఇవన్నీ ఇలాంటివి. ఇవి డిప్రెషన్ లాంటి మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి సహకరిస్తాయంటున్నారు పరిశోధకులు.
మన జీర్ణకోశంలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించే 400-500 రకాల మంచి బాక్టీరియా ఉన్నాయి. ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రేగు క్యాన్సర్, ప్రేగు ఇన్ఫెక్షన్‌లను రాకుండా ఆపుతాయి.
పెరుగు, పులియబెట్టిన పదార్థాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆస్పరాగస్ అరటి పండ్లు, ఓట్స్, యాపిల్స్, ఫ్లాక్స్ సీడ్స్, బార్లీల్లో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి.