Telugu Global
Health & Life Style

పగటిపూట కునుకు మంచిదేనా?

మధ్యాహ్నం టైంలో అలా ఓ కునుకు తీయడం చాలామందికి అలవాటు. వర్క్ చేసే వాళ్లు కూడా డే టైంలో ఓ పది నిముషాలైనా ఒక కునుకు తీస్తుంటారు. దీన్నే పవర్ న్యాప్ అంటారు. ఇంతకీ ఇది మంచిదేనా? మధ్యాహ్నం పడుకోవడం మంచి అలవాటు కాదని అనుకుంటుంటారు చాలామంది. నీరసం, బద్ధకం ఉంటే అలా నిద్రొస్తుంది అనుకుంటారు. కానీ రీసెంట్ గా జరిగిన ఓ స్టడీ ప్రకారం.. మధ్యాహ్నం నిద్ర.. వయసు పైబడిన వారు షార్ప్ గా ఉండేలా […]

పగటిపూట కునుకు మంచిదేనా?
X

మధ్యాహ్నం టైంలో అలా ఓ కునుకు తీయడం చాలామందికి అలవాటు. వర్క్ చేసే వాళ్లు కూడా డే టైంలో ఓ పది నిముషాలైనా ఒక కునుకు తీస్తుంటారు. దీన్నే పవర్ న్యాప్ అంటారు. ఇంతకీ ఇది మంచిదేనా?

మధ్యాహ్నం పడుకోవడం మంచి అలవాటు కాదని అనుకుంటుంటారు చాలామంది. నీరసం, బద్ధకం ఉంటే అలా నిద్రొస్తుంది అనుకుంటారు. కానీ రీసెంట్ గా జరిగిన ఓ స్టడీ ప్రకారం.. మధ్యాహ్నం నిద్ర.. వయసు పైబడిన వారు షార్ప్ గా ఉండేలా చేస్తుందని చెప్తోంది. అంతేకాదు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండే వారి కంటే నిద్రపోయిన వారు మరింత ప్రశాంతంగా ఉంటారని రీసెర్చర్లు చెప్తున్నారు.
ఈ స్టడీలో 60ఏళ్ల కంటే పైబడిన 2వేల 214మందిపై స్టడీ నిర్వహించారు. వీరిలో వెయ్యి 534మంది రెగ్యులర్ గా మధ్యాహ్నగ నిద్రపోతుండగా.. 680 మంది అప్పుడప్పుడు మాత్రమే నిద్రపోయే వారు. వీరందరిలో మధ్యాహ్నం పడుకునే వారు ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉన్నట్టు తేలింది. ఈ విషయం జనరల్ సైకియాట్రి జర్నల్ లో పబ్లిష్ అయింది.

డే టైంలో అలా ఓ కునుకు తీసే వారి బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ నుంచి రికవరీ అవుతుందట. అలా నిద్రపోయి లేస్తే అవసరం లేని డేటా అంతా క్లియర్ అయ్యి, కొంత ప్రశాంతత లభిస్తుందిని రీసెర్చర్లు చెప్తున్నారు. అందుకే లంచ్ చేసిన తర్వాత ఐదు నుంచు ముప్పై నిమిషాల పాటు పడుకోవడం మంచిదంటున్నారు. ఇలా చేయడం వల్ల మెదడులో గందరగోళం తగ్గి, మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎనర్జీ జనరేట్ అవుతుంది. యాంగ్జైటీ, స్ట్రెస్, మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి.

First Published:  27 Jan 2021 9:58 AM IST
Next Story