లంగ్స్‌పై ఫోకస్ పెట్టాలి
మనలో చాలామందికి తరచుగా జలుబు, దగ్గు వస్తుంటాయి. అలా వస్తుందంటే.. పైకి శరీరం హెల్దీగా కనిపించినా.. లోపల ఏదో తేడా ఉందని అర్థం. అందులోనూ ఊపిరితిత్తులు కొంచెం వీక్‌గా ఉంటేనే తరచూ ఇలాంటి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అందుకే మామూలు హెల్త్ కేర్‌తో పాటు స్పెషల్‌గా లంగ్స్‌పై కూడా ఫోకస్ పెట్టాలి. కొన్ని చిన్న చిన్న టిప్స్‌తో.. లంగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. లంగ్ కెపాసిటీని పెంచాలంటే ముందుగా లంగ్స్‌ను పాడు చేసే స్మోకింగ్ అలవాట్లను మానుకోవాలి. ఒక్కసారి స్మోకింగ్‌ను […]
మనలో చాలామందికి తరచుగా జలుబు, దగ్గు వస్తుంటాయి. అలా వస్తుందంటే.. పైకి శరీరం హెల్దీగా కనిపించినా.. లోపల ఏదో తేడా ఉందని అర్థం. అందులోనూ ఊపిరితిత్తులు కొంచెం వీక్‌గా ఉంటేనే తరచూ ఇలాంటి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అందుకే మామూలు హెల్త్ కేర్‌తో పాటు స్పెషల్‌గా లంగ్స్‌పై కూడా ఫోకస్ పెట్టాలి. కొన్ని చిన్న చిన్న టిప్స్‌తో.. లంగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. లంగ్ కెపాసిటీని పెంచాలంటే ముందుగా లంగ్స్‌ను పాడు చేసే స్మోకింగ్ అలవాట్లను మానుకోవాలి. ఒక్కసారి స్మోకింగ్‌ను మానుకున్న తర్వాత మెల్లగా లంగ్స్ తిరిగి డిటాక్స్ అవ్వడం మొదలుపెడతాయి. అందుకే వీలైనంత త్వరగా స్మోకింగ్‌కు బై చెప్పేయడం బెటర్.
కఫాన్ని తగ్గించాలి
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. కఫాన్ని తగ్గిచాలి. కఫాన్ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. చాక్లెట్లు, క్రీం బిస్కట్లు, స్వీట్లు, కేకులు, పాల పదార్థాలు, కూల్ డ్రింక్స్‌తో కఫం పెరుగుతుంది. అందుకే వాటికి దూరంగా ఉండాలి. కొంచెం కఫం పెరగిన వెంటనే.. వేడి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే మిరియాలు, అల్లం, శొంఠి, పసుపు వంటి వాటిని ఆహారంలో వాడడం వల్ల కఫం తగ్గుతుంది. సహజసిద్ధ యాంటీఆక్సిడెంట్ అయిన ఉసిరిని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడప్పుడు మిరియాలు, తేనె కలిపి కషాయంలాగా చేసుకుని వేడిచేసుకుని తాగినా మంచిదే.
ప్రాణాయామం
ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకునేందుకు ప్రాణాయామ సాధన కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఒత్తిడికి లోనయినప్పుడు ఆ ప్రభావం శ్వాస మీద పడుతుంది. ఫలితంగా ఊపిరి పీల్చుకుని, వదిలే వేగం పెరిగుతుంది. ప్రాణాయామం ద్వారా ఈ ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస వేగం నిదానంగా ఉంటుంది.
కాలుష్యం
మన నగరాల్లో కాలుష్యం ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే! అందుకే వీలైనంత వరకూ కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. కరోనాతో అలవాటైన మాస్క్‌ను కంటిన్యూ చేయాలి. కాలుష్యం నుంచి కాపాడేందుకు మాస్క్ బాగా పనికొస్తుంది. మాస్క్ సూక్ష్మక్రిములను అడ్డుకోవడంతో పాటు వాతావరణంలో కలిసిన దుమ్ము, ధూళి, పొగలు ఊపిరితిత్తుల్లోకి చేరుకోకుండా కొంతవరకూ ఆపుతుంది.
ఫుడ్
ఊపిరితిత్తులను హెల్దీగా ఉంచడంలో పోషకాహారం పాత్ర కూడా ముఖ్యమే. ముఖ్యంగా విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ ఉండే పాలు, గుడ్లు, నారింజ, క్యారెట్లు తింటుండాలి. అలాగే విటమిన్ ఇ, సి కోసం నిమ్మజాతి పండ్లు,మొలకెత్తిన గింజలు తినాలి. వీటితో పాటు క్యాబేజీ, బ్రకోలి, కాలీఫ్లవర్ కూడా ఊపిరితిత్తులకు మంచివి.