Telugu Global
NEWS

నిమ్మగడ్డ దూకుడు.. ఉన్నతాధికారుల బదిలీ..!

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్​ ఇవ్వడంతో ఎన్నికల సంఘం కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ దూకుడు పెంచారు. పంచాయతీరాజ్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్​ కమిషనర్​ గిరిజా శంకర్​ను ఆయన బదిలీ చేశారు. అంతేకాక సర్వీస్​ రికార్డుల్లో కూడా తప్పిదాలు నమోదుచేయాలని ఆదేశించారు. గతంలో ఎన్నికల సంఘం షెడ్యూల్​ను జారీచేశాక వీళ్లిదర్దూ సహకరించలేదు. దీంతో సమయం చూసి నిమ్మగడ్డ వేటు వేశారు. వీళ్లతోపాటు చాలామంది అధికారులు కూడా ఎన్నికలసంఘానికి సహకరించలేదు. అయితే పంచాయతీరాజ్​శాఖ ఉన్నతాధికారుల […]

నిమ్మగడ్డ దూకుడు.. ఉన్నతాధికారుల బదిలీ..!
X

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్​ ఇవ్వడంతో ఎన్నికల సంఘం కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ దూకుడు పెంచారు. పంచాయతీరాజ్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్​ కమిషనర్​ గిరిజా శంకర్​ను ఆయన బదిలీ చేశారు. అంతేకాక సర్వీస్​ రికార్డుల్లో కూడా తప్పిదాలు నమోదుచేయాలని ఆదేశించారు. గతంలో ఎన్నికల సంఘం షెడ్యూల్​ను జారీచేశాక వీళ్లిదర్దూ సహకరించలేదు. దీంతో సమయం చూసి నిమ్మగడ్డ వేటు వేశారు. వీళ్లతోపాటు చాలామంది అధికారులు కూడా ఎన్నికలసంఘానికి సహకరించలేదు.

అయితే పంచాయతీరాజ్​శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే 3.62 లక్షల మంది ఓటర్లకు ఓటుహక్కు లేకుండా పోయిందని ఆరోపించారు. గత కొంతకాలంగా ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం.. నిర్వహించి తీరాల్సిందేనని ఎన్నికల సంఘం పట్టుబట్టింది.

ఈ విషయం కోర్టుల దాకా కూడా వెళ్లింది. చివరకు సుప్రీంకోర్టు ఎన్నికలసంఘానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దీంతో ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొన్నది.

ప్రస్తుతం నిమ్మగడ్డ తన అధికారాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఫిక్స్​ అయినట్టున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడుతున్నది.

First Published:  26 Jan 2021 6:23 AM GMT
Next Story