నాగచైతన్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
అందమైన జోడీ నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తున్న చిత్రం ‘‘లవ్ స్టోరీ’’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది.. భారీ అంచనాలున్న ఈ ప్రేమ కావ్యాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.. హాట్ సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేస్తూ.. ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది టీమ్. ఈ పోస్టర్ ఇప్పుడు […]
అందమైన జోడీ నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తున్న చిత్రం ‘‘లవ్ స్టోరీ’’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్
కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది.. భారీ అంచనాలున్న ఈ ప్రేమ
కావ్యాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్..
హాట్ సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేస్తూ.. ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్
ను వదిలింది టీమ్. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.. ఇప్పుడు రిలీజ్ డేట్
అనౌన్స్ అయ్యేసరికి నాగచైతన్య అభిమానులంతా అంతా ఏప్రిల్ 16 కోసం వెయిట్ చేస్తున్నారు.
”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ
చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా
నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు.