జాతిరత్నాలు దూసుకొస్తున్నారు
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న కామెడీ చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్ కెవి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒక కీలకపాత్రలో నటిస్తోంది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న `జాతి రత్నాలు` థియేటర్లలో విడుదలవుతున్నట్లు తెలుపుతూ ఈ రోజు మోషన్ పోస్టర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ చిత్రం నుండి ప్రమోషనల్ కంటెంట్‌గా విడుదల చేసిన పోస్టర్స్‌కి, జోగిపేట శ్రీకాంత్‌గా […]
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న కామెడీ చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ కెవి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒక కీలకపాత్రలో నటిస్తోంది.
మహాశివరాత్రి కానుకగా మార్చి 11న 'జాతి రత్నాలు' థియేటర్లలో విడుదలవుతున్నట్లు తెలుపుతూ ఈ రోజు మోషన్ పోస్టర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్.
ఇప్పటికే ఈ చిత్రం నుండి ప్రమోషనల్ కంటెంట్‌గా విడుదల చేసిన పోస్టర్స్‌కి, జోగిపేట శ్రీకాంత్‌గా మొదటి జాతి రత్నం నవీన్ పొలిశెట్టిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే..
ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి సింగిల్ చిట్టి లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సిద్దం మనోహర్ ఛాయాగ్రాహణం అందిస్తుండగా.. అభినవ్ రెడ్డి దండా ఎడిటింగ్ చేస్తున్నారు.