Telugu Global
NEWS

ఎన్నికలకు ప్రభుత్వం ఓకే..!

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఎన్నికల కమిషన్​ ప్రకటించిన తేదీల్లోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎటువంటి భేషజాలు లేవు. అయితే రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నందున ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం భావించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తాం. ప్రభుత్వ […]

ఎన్నికలకు ప్రభుత్వం ఓకే..!
X

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఎన్నికల కమిషన్​ ప్రకటించిన తేదీల్లోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆయన ఏమన్నారంటే.. ‘ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎటువంటి భేషజాలు లేవు. అయితే రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నందున ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం భావించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తాం. ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో కరోనాపై కొంత ఆందోళన ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ రెండు అంశాలను సమన్వయం చేసుకోని ఎన్నికలు నిర్వహిస్తాం’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై గత కొంతకాలంగా ప్రతిష్ఠంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికలు ఎలాగైనా నిర్వహించి తీరాలని ఎన్నికల సంఘం పట్టుబట్టింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్​ను విడుదల చేసింది.

అయితే ఏపీ సర్కార్​ హైకోర్టుకు వెళ్లగా ఎన్నికలు నిర్వహించవచ్చని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం సుప్రీం తలుపుపట్టింది. సుప్రీంలో కూడా ఎన్నికల సంఘానికే అనుకూలంగా తీర్పు రావడంతో ప్రభుత్వం వెనక్కితగ్గింది.

First Published:  25 Jan 2021 10:21 AM GMT
Next Story