దసరా కానుకగా వస్తున్న ఆర్ఆర్ఆర్
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎంటైర్ ఇండియా ఎదురుచూస్తున్న RRR సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతున్నారంటూ […]
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)'. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎంటైర్ ఇండియా ఎదురుచూస్తున్న RRR సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతున్నారంటూ అందులో నటిస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ కొన్ని రోజుల కిందట ప్రకటించింది. కానీ ఇప్పుడా తేదీని 13కు మార్చారు. డూడీ తన పోస్ట్ ను డిలీట్ చేసింది కూడా.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని, హాలీవుడ్ స్టార్ అలిసన్ డూడీ సహా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్నారు.
ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని ఎలా ప్రారంభించారనేదే RRR స్టోరీ.