ఆరోగ్యకరమైన గుండె కోసం ఐదు ఫుడ్స్
ప్రతి ఏటా సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువశాతం మరణాలు కార్డియోవాస్కులర్ డిసీజెస్ (సివిడి) వల్లనే జరుగుతున్నాయి. అందుకే దీనిపై కాస్త స్పెషల్ కేర్ అవసరం. గుండె సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యమైంది ఆహారం. సరైన ఫుడ్ తీసుకుంటే గుండె సమస్యల నుంచి బయటపడొచ్చు. కార్డియో వాస్కులర్ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా ఈ ఐదు ఫుడ్స్ ను ఆహారంలో చేర్చాలి. వెజిటబుల్స్ బంగాళాదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు, గ్రీన్ బీన్స్, సోయాబీన్స్, బచ్చలికూర, బ్రోకొలీ పాలకూర వంటి కూరగాయలు మన గుండెను […]
ప్రతి ఏటా సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువశాతం మరణాలు కార్డియోవాస్కులర్ డిసీజెస్ (సివిడి) వల్లనే జరుగుతున్నాయి. అందుకే దీనిపై కాస్త స్పెషల్ కేర్ అవసరం. గుండె సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యమైంది ఆహారం. సరైన ఫుడ్ తీసుకుంటే గుండె సమస్యల నుంచి బయటపడొచ్చు. కార్డియో వాస్కులర్ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా ఈ ఐదు ఫుడ్స్ ను ఆహారంలో చేర్చాలి.
వెజిటబుల్స్
బంగాళాదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు, గ్రీన్ బీన్స్, సోయాబీన్స్, బచ్చలికూర, బ్రోకొలీ పాలకూర వంటి కూరగాయలు మన గుండెను కాపాడతాయి. వాటిలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలన్నీ ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో అసమానతలను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్, ఇంకా హార్ట్ స్ట్రోక్‌కు కారణమయ్యే కొవ్వుల శాతాన్ని కూడా కూరగాయలు తగ్గిస్తాయి.
ఫ్రూట్స్
కూరగాయల లాగానే, పండ్లు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. యాపిల్స్, ద్రాక్ష, దానిమ్మ, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ, ఆవకాడో లాంటి ఫ్రూట్స్ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, రక్తంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడతాయి.
గింజలు
విత్తనాల్లో పోషకాలలో నిండుగా ఉంటాయి. కాయలు వాటి గింజలు, తృణధాన్యాల్లాంటివి విటమిన్లు, ఖనిజాలు, పాలిఫెనాల్స్ లాంటి ఫైటోకెమికల్స్ ను కలిగి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి.
నట్స్
వేరుశెనగ, బాదం, వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు వంటి గింజల్లో ఉండే హెల్దీ ప్రొటీన్స్, ఫైబర్ తో పాటు ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లను తగ్గిస్తాయి. అలాగే ధమనుల్లో అడ్డుపడే కొవ్వుల్ని కూడా తగ్గిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. గింజల్లో మోనోఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (MUFA), పాలిఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (PUFA) ఉంటాయి. ఇవి గుండె ప్రమాదాలను తగ్గిస్తాయి.
టీలు
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. బ్లాక్ టీ, గ్రీన్ టీ హార్ట్ స్ట్రోకులను 10 నుంచి 20 శాతం వరకు తగ్గించగలవు. టీలలో ఫ్లేవనాల్ అనే పాలిఫెనాల్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది అలాగే ధమనుల రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
స్పైసెస్
ఆక్సిడేటివ్ స్ట్రెస్.. గుండె సంబంధిత సమస్యలను ఎక్కువయ్యేలా చేస్తుంది. పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చినచెక్క, కొత్తిమీర ల్లాంటివి తినడం వల్ల శరీరానికి ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభించి.. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్, ఎక్కువ రక్తపోటును కూడా తగ్గిస్తాయి.