పంచాయతీ ఎన్నికలపై వీడని ఉత్కంఠ ! తీర్పు తర్వాతే క్లారిటీ వస్తుందా ?
పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ వీడలేదు. నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ ఏపీలో చూస్తే ఎక్కడా నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అసలు ఏర్పాట్లపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా రాలేదు. నామినేషన్ల తొలిరోజు ఏం జరగబోతోంది? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా? తాత్కాలికంగా వాయిదా వేస్తుందా? అని పార్టీలు,ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలి దశ ఎన్నికలో 146 మండలాల్లోని […]
పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ వీడలేదు. నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ ఏపీలో చూస్తే ఎక్కడా నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అసలు ఏర్పాట్లపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా రాలేదు. నామినేషన్ల తొలిరోజు ఏం జరగబోతోంది? అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా? తాత్కాలికంగా వాయిదా వేస్తుందా? అని పార్టీలు,ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలి దశ ఎన్నికలో 146 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్లు వేసేందుకు తెలుగుదేశం నేతలు రెడీ అవుతున్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని గానీ, నామినేషన్లు స్వీకరించాలనిగానీ, జిల్లా అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. దీంతో వారు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఏం చెబుతుంతోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సుప్రీం తీర్పు ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలని చెబితే ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సహాయ నిరాకరణ కొనసాగిస్తారా? ఇప్పటికిప్పుడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారా? అనేది వేచిచూడాలి.