జనవరి 29న ఆహాలో 'క్రాక్'.. మండి పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్, అభిమానులు
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రవితేజకు మంచి హిట్ దొరికింది. కరోనా కారణంగా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీలోనే రూ. 30 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. అదే పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తే ఇప్పటికే రూ. 40 కోట్ల వసూళ్లు దాటిపోయేవని అభిమానులు అంటున్నారు. ఒకవైపు సినిమా మంచి వసూళ్లతో దూసుకొని […]
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రవితేజకు మంచి హిట్ దొరికింది. కరోనా కారణంగా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీలోనే రూ. 30 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. అదే పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తే ఇప్పటికే రూ. 40 కోట్ల వసూళ్లు దాటిపోయేవని అభిమానులు అంటున్నారు.
ఒకవైపు సినిమా మంచి వసూళ్లతో దూసుకొని పోతున్న సమయంలోనే ఈ చిత్రాన్ని జనవరి 29న ‘ఆహా’ ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించారు. విడుదలకు ముందే ఈ సినిమా థియేటర్, ఓటీటీ రిలీజ్‌పై ఒప్పందం జరిగింది. దీని ప్రకారమే మూడు వారాల తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే వసూళ్లు భారీ స్థాయిలో ఉన్న సమయంలో ఎలా రిలీజ్ చేస్తారంటూ డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆహాను ట్రోల్ చేస్తున్నారు.
కాగా, దీనిపై ఆహా యాజమాన్యం స్పందించింది. సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత విడుదల చేసుకోవడానికి ఒప్పందం కుదిరిందని.. అయినా సరే మూడు వారాల తర్వాత విడుదల చేస్తున్నామని పేర్కొన్నది. ఆహా ఓటీటీ దీన్ని రూ. 8.2 కోట్లకు కొనుక్కున్నది. ఇప్పుడు రిలీజ్ చేస్తేనే డబ్బులు తిరిగిరాబట్టుకునే వీలుంటుంది కాబట్టే విడుదల చేస్తున్నట్లు తెలుస్తున్నది.