Telugu Global
NEWS

ఇదేమి షరతు.. మండి పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. దాదాపు ఏడాదిగా ఆన్‌లైన్ పద్దతిలోనే విద్యార్థులు చదువుకుంటున్నారు. కేంద్ర అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా పాఠశాలలు తెరవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 9, 10వ తరగతి విద్యార్థులకు స్కూల్స్‌లో పాఠాలు బోధించడానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ఇక్కడే ఒక నిబంధన […]

ఇదేమి షరతు.. మండి పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
X

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. దాదాపు ఏడాదిగా ఆన్‌లైన్ పద్దతిలోనే విద్యార్థులు చదువుకుంటున్నారు. కేంద్ర అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా పాఠశాలలు తెరవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

9, 10వ తరగతి విద్యార్థులకు స్కూల్స్‌లో పాఠాలు బోధించడానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ఇక్కడే ఒక నిబంధన విధించింది. పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఒక వేళ విద్యార్థికి కరోనా సోకితే.. తల్లిదండ్రులదే బాధ్యత అని.. వాళ్లే చికిత్స అందిస్తామనే హామీ ఇవ్వాలని కోరింది. దీనికి సంబంధించి విద్యార్థి, తల్లిదండ్రులు ఒకపత్రంపై సంతకం చేసి హామీ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. అలా హామీ ఇచ్చిన విద్యార్థులు మాత్రమే తరగతులకు అనుమతించబడతారని స్పష్టం చేసింది.

కాగా, ఇప్పటికే ఈ ఉత్తర్వులు అన్నీ పాఠశాలలకు చేరాయి. తల్లిదండ్రులు ఈ అంగీకార పత్రంపై సంతకాలు చేసి హాజరు కావొచ్చని తెలిపారు. కాగా, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలలో విద్యార్థుల భద్రత, బాధ్యత ప్రభుత్వానిదే కదా.. మరెందుకు ఈ నిబంధన అని విమర్శిస్తున్నారు.

అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో మరో సర్క్యులర్ జారీ చేసింది. విద్యా సంస్థలు తెరచుకున్నా, హాజరు మాత్రం తప్పనిసరి కాదన్న వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. స్కూల్స్ కు వచ్చేందుకు ఇష్టపడని వారు ఆన్లైన్ లోనే క్లాసులు వినవచ్చని ఉత్తర్వులలో తెలిపింది. 75% అటెండెన్స్ నిబంధలను ఈ విద్యా సంవత్సరానికి అమలు చేయబోమని తెలిపింది.

First Published:  24 Jan 2021 3:22 AM GMT
Next Story