కండల కోసం ఇవి తినాలి
ఫిట్‌గా ఉంటూ, కండలు తిరిగే బాడీ ఉండాలని చాలామంది కోరుకుంటారు. మరయితే దానికోసం.. కేవలం జిమ్‌లో కుస్తీలు పడితే సరిపోదు. శరీరానికి సరైన ఆహారం అందాలి. ఇంకా చెప్పాలంటే కండలకు ప్రొటీన్స్ అందాలి. ఆ డైట్ ఎలా ఉండాలంటే.. కండలు పెరగాలంటే ముఖ్యంగా ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. జిమ్‌లో కసరత్తులు చేయడం వల్ల కండరాలు ఎక్స్ ప్యాండ్ అవుతాయి. సరైన ప్రొటీన్ తీసుకున్నప్పుడే సాగిన కండరాల్లో ప్రొటీన్ చేరి కండరం సైజ్ పెరుగుతుంది. కండలు పెంచేందుకు […]
ఫిట్‌గా ఉంటూ, కండలు తిరిగే బాడీ ఉండాలని చాలామంది కోరుకుంటారు. మరయితే దానికోసం.. కేవలం జిమ్‌లో కుస్తీలు పడితే సరిపోదు. శరీరానికి సరైన ఆహారం అందాలి. ఇంకా చెప్పాలంటే కండలకు ప్రొటీన్స్ అందాలి. ఆ డైట్ ఎలా ఉండాలంటే..
కండలు పెరగాలంటే ముఖ్యంగా ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. జిమ్‌లో కసరత్తులు చేయడం వల్ల కండరాలు ఎక్స్ ప్యాండ్ అవుతాయి. సరైన ప్రొటీన్ తీసుకున్నప్పుడే సాగిన కండరాల్లో ప్రొటీన్ చేరి కండరం సైజ్ పెరుగుతుంది.
కండలు పెంచేందుకు తినాల్సిన ఫుడ్స్‌లో బెస్ట్ ఫుడ్ చికెన్. చికెన్ ద్వారా బెస్ట్ ప్రొటీన్ అందుతుంది. వంద గ్రాముల చికెన్ లో 31 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మరే ఫుడ్ అంత ప్రొటీన్ ను ఇవ్వలేదు. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్‌లో అచ్చంగా ప్రొటీన్ ఉంటుంది. అలాగే చికెన్ తినడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి.
మజిల్స్ కోసం మరో మంచి ఫుడ్ ఓట్ మీల్. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్,క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. ఇవి కండలు పెరగడానికి సహాయ పడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ని,బీపీని అదుపులో ఉంచుతాయి.
కండరాలు పెరుగుదలకు పాలకూర కూడా హెల్ప్ చేస్తుంది. పాలకూరలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ A, విటమిన్ K,విటమిన్ E ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ఎముకలు బలంగా మారతాయి. అలాగే ఇందులో గ్లూటమిన్, ఎమినో యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల కండలు పెరగడానికి ఇవన్నీ బాగా సాయపడుతాయి.
ఇక వీటన్నింటితో పాటు బ్రౌన్ రైస్ తీసుకోవడం కూడా చాలా అవసరం. వర్కవుట్‌కు కొన్ని గంటల ముందు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.
కండలు పెంచాలనుకునే వాళ్లు రోజూ మూడు లేదా నాలుగు గుడ్లు తినాలి. గుడ్డులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్ D,అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి కండలు పెంచేందుకు సాయపడతాయి.
కండలు పెంచాలనుకునే వాళ్లు జిమ్ వర్కవుట్స్ కంటే డైట్‌కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రోజూ నట్స్ లాంటి ప్రొటీన్ ఫుడ్, క్యారెట్, బీట్ రూట్ లాంటివి, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి.