ఆ మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. మరోవైపు కరోనా బారిన పడిన వ్యక్తులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. చైనాలో పుట్టి ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒకసారి కరోనా సోకిన తర్వాత తిరిగి ఆ వైరస్ దాడి చేయడం చాలా కొన్ని సందర్భాల్లోనే జరిగింది. కరోనా సోకితే మొదట్లో తలనొప్పి, జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉండేవి. […]
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. మరోవైపు కరోనా బారిన పడిన వ్యక్తులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. చైనాలో పుట్టి ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒకసారి కరోనా సోకిన తర్వాత తిరిగి ఆ వైరస్ దాడి చేయడం చాలా కొన్ని సందర్భాల్లోనే జరిగింది.
కరోనా సోకితే మొదట్లో తలనొప్పి, జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉండేవి. కాలక్రమంలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకుతూ ఉన్నది. అయితే ఒకసారి కరోనా నుంచి కోలుకుంటే యాంటీ బాడీలు పెరిగి ఆ రోగం తిరిగి రాదని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ, రాజస్థాన్‌లోని ఒక మహిళకు మాత్రం గత అగస్టు నుంచి ఇప్పటి వరకు 31 సార్లు కరోనా నిర్దారణ అయ్యింది.
రాజస్థాన్‌లోని అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారద అనే మహిళకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. కానీ వాంతులు, జ్వరం వస్తుండటంతో తొలిసారి అగస్టులో కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి 31 సార్లు కరోనా పరీక్షలు చేశారు. చేసిన ప్రతీ సారి ఆ మహిళ కరోనా పాజిటివ్ గానే తేలుతున్నది. భరత్‌పూర్ జిల్లాలోని ఆర్బీఎం ఆసుపత్రిలో ప్రస్తుతం శారదకు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి లక్షణలు లేకున్నా ఆమె పాజిటివ్ గానే వస్తున్నదని.. దానికి గల కారణమేంటో పరిశోధిస్తున్నామని అక్కడి వైద్యులు చెబుతున్నారు.