Telugu Global
NEWS

ఏపీ బీజేపీలో గ్రూప్‌ వార్‌ !

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. ఇక రాష్ట్రంలో దూకుడే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కన్పించడం లేదు. విశాఖలో జరిగిన కోర్‌ కమిటీ మీటింగ్‌లో రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసంపై నిరసనగా ఈ యాత్ర చేపట్టాలని అనుకున్నారు. ఫిబ్రవరిలో ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. కానీ యాత్రలో ఎవరు పాల్గొంటారో ఇప్పటివరకూ క్లారిటీ మాత్రం లేదు. అంతకుముందు రామతీర్థంలో నిరసనకు సోము వీర్రాజు ప్లాన్‌ చేశారు. అదే రోజు వేరే […]

ఏపీ బీజేపీలో గ్రూప్‌ వార్‌ !
X

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. ఇక రాష్ట్రంలో దూకుడే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కన్పించడం లేదు. విశాఖలో జరిగిన కోర్‌ కమిటీ మీటింగ్‌లో రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసంపై నిరసనగా ఈ యాత్ర చేపట్టాలని అనుకున్నారు. ఫిబ్రవరిలో ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. కానీ యాత్రలో ఎవరు పాల్గొంటారో ఇప్పటివరకూ క్లారిటీ మాత్రం లేదు.

అంతకుముందు రామతీర్థంలో నిరసనకు సోము వీర్రాజు ప్లాన్‌ చేశారు. అదే రోజు వేరే ఎజెండాతో శ్రీకాళహస్తిలో మరో నేత విష్ణువర్ధన్‌రెడ్డి శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టారు. ఇళ్ల స్థలాల సేకరణలో అక్రమాలు అంటూ ఆయన మీడియా ముందు ఫైట్‌ చేపట్టారు. రామతీర్థం ఆందోళన తాము చేపడితే.. విష్ణు వేరే ఎజెండాతో మీడియాలో హైలెట్‌ కావడం సోము వీర్రాజుకు ఆగ్రహం తెప్పించిందట. విష్ణుకు వెంటనే ఫోన్‌ చేయడంతో లైవ్‌ కెమెరాల ముందే ఆయన టాపిక్‌ మార్చుకున్నారట. అప్పటి నుంచి విష్ణు సోము డైరెక్షన్‌లోకి వెళ్లారని తెలుస్తోంది.

ఇప్పుడు ఏపీలో సోము వీర్రాజుకు గ్రూపు అంటూ లేకుండా పోయింది. విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్‌ మాత్రమే కొంచెం యాక్టివ్‌గా ఉన్నారు. మిగతా నేతలు పార్టీ కార్యక్రమాలకు పిలిస్తే వస్తున్నారట. లేకపోతే ఇంట్లోనే రెస్ట్‌ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీల జాడ కనిపించడం లేదు. మొన్న ఈ మధ్య చుట్టపు చూపుగా సీఎం రమేష్‌ విజయవాడ వచ్చారు. పది నిమిషాలు హడావుడి చేశారు. కానీ సుజనా చౌదరి, కర్నూలు టీజీ వెంకటేష్‌ మాత్రం ఎక్కడికి రావడం లేదు. కరోనా వచ్చిన తర్వాత పురందేశ్వరి కూడా యాక్టివ్‌గా లేరు. నిన్న మొన్నటివరకు హడావుడి చేసిన జీవీఎల్ కూడా ఇప్పుడు పెద్దగా మాట్లాడడం లేదు.

పాత వెంకయ్యనాయుడు బ్యాచ్‌ మాత్రం అసలు తెరపైకి రావడం లేదు. మాజీ ఎంపీ హరిబాబుతో పాటు ఇతర నేతల అడ్రస్‌ లేకుండా పోయింది. సోము వీర్రాజుకు ఈ నేతలు ఒక రకంగా సహాయ నిరాకరణ చేస్తున్నారట. సోము ఒకటి అనుకుంటే.. వేరు వేరే రకంగా వ్యవహరిస్తున్నారట. మొత్తానికి బీజేపీలో ముదిరిన గ్రూపుల రాజకీయం తిరుపతి ఉప ఎన్నిక సమయానికి మరింత ముదిరే అవకాశం కన్పిస్తోంది.

First Published:  23 Jan 2021 6:32 AM IST
Next Story