Telugu Global
Others

గూగుల్‌కి చిక్కకండి

మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్కడున్నాం? అనే విషయాలు మన ఇంట్లోవాళ్లకైనా తెలుస్తాయో, లేదో కానీ.. గూగుల్‌కి మాత్రం తెలుస్తాయి. ఎందుకంటే.. గూగుల్ తమ యూజర్ల డేటాను ఎప్పటికప్పుడూ స్టోర్ చేస్తూనే ఉంటుంది. వాళ్ల డేటాను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తుంటుంది. ఎప్పుడు ఏది సెర్చ్ చేశారు? ఏ లొకేషన్‌లో ఉన్నారు? ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏం వెతుకున్నారు లాంటి వివరాలన్నీ పసిగడుతూనే ఉంటుంది. మరిప్పుడు ఏం చేయాలో తెలుసా? గూగుల్ మన యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయడం నచ్చకపోతే.. గూగుల్ […]

గూగుల్‌కి చిక్కకండి
X

మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్కడున్నాం? అనే విషయాలు మన ఇంట్లోవాళ్లకైనా తెలుస్తాయో, లేదో కానీ.. గూగుల్‌కి మాత్రం తెలుస్తాయి. ఎందుకంటే.. గూగుల్ తమ యూజర్ల డేటాను ఎప్పటికప్పుడూ స్టోర్ చేస్తూనే ఉంటుంది. వాళ్ల డేటాను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తుంటుంది. ఎప్పుడు ఏది సెర్చ్ చేశారు? ఏ లొకేషన్‌లో ఉన్నారు? ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏం వెతుకున్నారు లాంటి వివరాలన్నీ పసిగడుతూనే ఉంటుంది. మరిప్పుడు ఏం చేయాలో తెలుసా?

గూగుల్ మన యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయడం నచ్చకపోతే.. గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్మిషన్ ఆపేయొచ్చు. అలాగే ఇప్పటివరకూ స్టోర్ చేసిన పర్సనల్ డేటా కూడా డిలీట్ చేయొచ్చు. అదెలాగంటే..

– ముందుగా గూగుల్ పేజీలో ‘google.com’ సైట్‌ను విజిట్ చేయాలి.
– ఇక్కడ గూగుల్ (జీమెయిల్) అకౌంటుతో లాగిన్ అవ్వాలి.
– టాప్ రైట్ కార్నర్‌లో మన ఫొటో లేదా సర్కిల్ ఐకాన్ పై క్లిక్ చేసి, ‘మ్యానేజ్ యువర్ గూగుల్ అకౌంట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
– అందులో ‘డేటా అండ్ పర్సనలైజేషన్’ ఆప్షన్ క్లిక్ చేయాలి.
– అక్కడ ‘టేక్ ద ప్రైవసీ చెకప్’, ‘యాక్టివిటీ కంట్రోల్స్’ అనే ప్యానెల్స్ కనిపిస్తాయి.
– యాక్టివిటీ కంట్రోల్స్ కింద ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ట్రాకింగ్’, ‘లొకేషన్ హిస్టరీ’, ‘యూట్యూబ్ హిస్టరీ’ – ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటికి చెక్ మార్క్స్ ఉంటే తీసేయాలి.
– అలాగే గూగుల్ అల్రెడీ స్టోర్ చేసిన మన పర్సనల్ డేటాను డిలీట్ చేయాలంటే.
– ఇంతకు ముందు చెప్పిన యాక్టివిటీ కంట్రోల్స్ కింద ఉండే ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ’, ‘లొకేషన్ హిస్టరీ’, ‘యూట్యూబ్ హిస్టరీ’ ఆప్షన్స్ ని సెపరేట్ గా క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.

ఓపెన్ చేసిన తర్వాత ‘ఆటో డిలీట్’, ‘మ్యానేజ్ యాక్టివిటీ’ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి ఏయే డేటా డిలీట్ చెయ్యాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ డిలీట్ చేయాలి. అనే వివరాలు ఎంచుకోవాలి. అలాగే ‘ఆటో డిలీట్’ ఆప్షన్‌ను మూడు నెలలకు పెట్టుకుంటే మంచిది. లేకపోతే.. కొన్ని నెలల క్రితం మనం ఫోన్ లో ఎప్పుడు ఏది చేశాం. ఏ టైంకి ఏయాప్ ఓపెన్ చేశాం. గూగుల్ క్రోమ్ లో ఏమేం సెర్చ్ చేశాం లాంటి డేటా అంతా అలాగే ఉండిపోతుంది. అలాగే లొకేషన్ హిస్టరీని కూడా ఆఫ్‌లో ఉంచుకుంటే ప్రైవసీ ఉంటుంది.

First Published:  23 Jan 2021 8:52 AM IST
Next Story