Telugu Global
NEWS

నేడు జైలు నుంచి విడుదల కానున్న అఖిల ప్రియ

తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ గత 17 రోజులుగా చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ కావాలంటూ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టులో పెట్టుకున్న పిటిషన్‌కు సానుకూలంగా స్పందించింది. శుక్రవారం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అఖిల ప్రియ శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నది. కాగా, బెయిల్ సందర్భంగా కోర్టు రూ. 10వేల పూచికత్తుతో […]

నేడు జైలు నుంచి విడుదల కానున్న అఖిల ప్రియ
X

తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ గత 17 రోజులుగా చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ కావాలంటూ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టులో పెట్టుకున్న పిటిషన్‌కు సానుకూలంగా స్పందించింది. శుక్రవారం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

అఖిల ప్రియ శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నది. కాగా, బెయిల్ సందర్భంగా కోర్టు రూ. 10వేల పూచికత్తుతో పాటు ఇద్దరి ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతీ సోమవారం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేయాలని సూచించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది.

మరోవైపు ఇదే కేసులో ఏ3గా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు అతడి పిటిషన్‌ను కొట్టేసింది. కేసు దర్యాప్తులో ఉన్నందున అతడికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరడంతో కోర్టు ఆ మేరకు పిటిషన్ తిరస్కరించింది.

జనవరి 6న ప్రవీణ్ రావు అతడి సోదరులను ఒక భూవ్యవహారంలో అఖిల ప్రియ అనుచరులు కిడ్నాప్ చేశారు. హఫీజ్ పేటలోని రూ. 500 కోట్ల విలువైన భూమికి సంబంధించిన వివాదంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించి 19 మందిని అరెస్టు చేశారు. ఏ2 ఏవీ సుబ్బారెడ్డికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వగా.. కీలకమైన భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ఇంకా పరారీలోనే ఉన్నారు.

First Published:  23 Jan 2021 4:10 AM IST
Next Story