Telugu Global
NEWS

మేయర్ సీట్లో కూర్చొనే పార్టీ ఏదో? నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ

జీహెచ్​ఎంసీ ఎన్నికలు పూర్తయి చాలా రోజులైంది. ఫలితాలు కూడా వచ్చేశాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం పాలకమండలిని కొలువుతీర్చడం లేదు. దీంతో విపక్షాలు ముఖ్యంగా బీజేపీ.. ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తున్నది. ఓ దశలో బీజేపీ కార్పొరేటర్లు ప్రగతిభవన్ ను కూడా ముట్టడించేందుకు యత్నించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎట్టకేళకు ఎన్నికల సంఘం జీహెచ్​ఎంసీ మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈ మేరకు ఓ ప్రకటన […]

మేయర్ సీట్లో కూర్చొనే పార్టీ ఏదో? నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ
X

జీహెచ్​ఎంసీ ఎన్నికలు పూర్తయి చాలా రోజులైంది. ఫలితాలు కూడా వచ్చేశాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం పాలకమండలిని కొలువుతీర్చడం లేదు. దీంతో విపక్షాలు ముఖ్యంగా బీజేపీ.. ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తున్నది. ఓ దశలో బీజేపీ కార్పొరేటర్లు ప్రగతిభవన్ ను కూడా ముట్టడించేందుకు యత్నించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎట్టకేళకు ఎన్నికల సంఘం జీహెచ్​ఎంసీ మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పరోక్ష పద్ధతిలో ఎన్నికలను నిర్వహించనున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ జిల్లా కలెక్టర్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఒక వేళ ఆ రోజు కుదరని పక్షంలో మరుసటి రోజు 12వ తేదీన సెలవు ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తారు.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే విజయం సాధించింది. కానీ ఈ దఫా జీహెచ్ఎంసీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలు, బీజేపీ 48, ఎంఐఎం పార్టీ 44 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ సారి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలిచినప్పటికీ.. సొంతంగా పాలక మండలిని ఏర్పాటు చేసే మెజార్టీ లేదు.

దీంతో టీఆర్ఎస్ తప్పనిసరిగా ఎంఐఎం మద్దతు తీసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ స్థానాన్ని కేటాయించి, టీఆర్ఎస్ మేయర్ పదవి చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం మేము ముందు చెప్పినట్లుగా ఎంఐఎం, టీఆర్ఎస్ ఒక్కటేనన్న ఆరోపణలు నిజమయ్యాయని బీజేపీ ఆరోపించే అవకాశం ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితమైంది.

First Published:  22 Jan 2021 10:47 AM GMT
Next Story