క్షీణించిన శశికళ ఆరోగ్యం.. పరిస్థితి విషమం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించింది. కరోనా బారినపడిన ఆమె ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఊపిరి తిత్తులు దెబ్బతిన్నాయని, ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలియజేశారు. అక్రమాస్తుల కేసులో సుమారు నాలుగేళ్లుగా శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అందుకోసం అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. కాగా కొద్దిరోజులుగా శశికళ జ్వరంతో […]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించింది. కరోనా బారినపడిన ఆమె ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఊపిరి తిత్తులు దెబ్బతిన్నాయని, ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలియజేశారు.
అక్రమాస్తుల కేసులో సుమారు నాలుగేళ్లుగా శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అందుకోసం అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. కాగా కొద్దిరోజులుగా శశికళ జ్వరంతో బాధపడుతుండడంతో బుధవారం జైల్లోని ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆమెను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు తొలుత యాంటిజెన్ పరీక్షలు చేయగా కొవిడ్ నెగెటివ్‌గా వచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెకు అక్కడే చికిత్సలందిస్తూ వచ్చారు.
శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రస్తుతం శశికళ ఐసీయూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది.ఆమెకు టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడిజం కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ నెల 27వ తేదీన శశికళ జైలు నుంచి విడుదల కావాల్సి ఉండడంతో ఆమెకు స్వాగతం పలికేందుకు ఆమె మేనల్లుడు దినకరన్ ఏర్పాట్లు చేపట్టారు. తమిళనాడులో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో మళ్లీ తన రాజకీయ పునరాగమనం కోసం శశికళ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై పరిస్థితి విషమించడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.