రెడ్ మొదటి వారం వసూళ్లు
రెడ్ సినిమా సక్సెస్ ఫుల్ గా వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. తక్కువ రేట్లకు అమ్మడంతో, సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించింది. అలా ఈ 7 రోజుల్లో రెడ్ మూవీకి 15 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రామ్ కెరీర్ లో ఇది బ్లాక్ బస్టర్ హిట్ కాదు. జస్ట్ డీసెంట్ హిట్ మాత్రమే. కాకపోతే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య, 50శాతం ఆక్యుపెన్సీతో, రామ్ సినిమాకు ఈ […]
రెడ్ సినిమా సక్సెస్ ఫుల్ గా వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. తక్కువ రేట్లకు అమ్మడంతో, సినిమాకు
నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించింది. అలా ఈ 7 రోజుల్లో రెడ్ మూవీకి 15 కోట్ల 82 లక్షల
రూపాయల షేర్ వచ్చింది.
రామ్ కెరీర్ లో ఇది బ్లాక్ బస్టర్ హిట్ కాదు. జస్ట్ డీసెంట్ హిట్ మాత్రమే. కాకపోతే కరోనా లాంటి క్లిష్ట
పరిస్థితుల మధ్య, 50శాతం ఆక్యుపెన్సీతో, రామ్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు అంటే చెప్పుకోదగ్గ
విషయమే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 రోజుల్లో వచ్చిన షేర్ ఇలా ఉంది.
నైజాం – రూ. 5.7 కోట్లు
సీడెడ్ – రూ. 2.9 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.06 కోట్లు
గుంటూరు – రూ. 1.11 కోట్లు
ఈస్ట్ – రూ. 1.2 కోట్లు
వెస్ట్ – రూ. 1.1 కోట్లు
కృష్ణా – రూ. 1.07 కోట్లు
నెల్లూరు – రూ. 0.68 కోట్లు