పంచాయతీ ఎన్నికలకు లైన్‌క్లియర్.. నిమ్మగడ్డ స్పందన ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతున్నది అన్నది? ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి తీరాలని ఎన్నికల సంఘం పట్టుబడుతుండగా.. ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు […]
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతున్నది అన్నది? ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి తీరాలని ఎన్నికల సంఘం పట్టుబడుతుండగా.. ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పంచాయితీ కోర్టుకు చేరింది. మరోవైపు రాష్ట్రంలోని ఉద్యోగసంఘాల నాయకులు కూడా ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతున్నారు.
అయితే గురువారం ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
అయితే ప్రజారోగ్యం ముఖ్యమేనని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. 11న ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేయగా.. ఈ ఆదేశాలపై ఎస్ఈసీ అప్పీల్‌కు వెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించవచ్చంటూ తీర్పు చెప్పింది.
హైకోర్టు తీర్పుపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ముందు ప్రకటించినట్టుగానే ఎన్నికలను 4 దశల్లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ‘వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉంది. త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తాం’ అని ఎస్‌ఈసీ రమేష్ మీడియాకు వెల్లడించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు సమాచారం.