Telugu Global
NEWS

ఎవ్వరూ తగ్గట్లేదుగా..! పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకు జగన్​ సర్కార్​

ఏపీలోని పంచాయతీ ఎన్నికలపై గత కొంతకాలంగా సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డకు.. ఏపీ సీఎం జగన్​కు అస్సలు పడటం లేదని చెబుతున్నారు. నిమ్మగడ్డ టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ పదవినుంచి దిగిపోయాక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కానీ నిమ్మగడ్డ మాత్రం.. తాను దిగిపోయేలోపు ఎన్నికలు నిర్వహించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య వివాదం నెలకొన్నది. ఇందులో భాగంగా […]

ఎవ్వరూ తగ్గట్లేదుగా..! పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకు జగన్​ సర్కార్​
X

ఏపీలోని పంచాయతీ ఎన్నికలపై గత కొంతకాలంగా సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డకు.. ఏపీ సీఎం జగన్​కు అస్సలు పడటం లేదని చెబుతున్నారు. నిమ్మగడ్డ టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ పదవినుంచి దిగిపోయాక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కానీ నిమ్మగడ్డ మాత్రం.. తాను దిగిపోయేలోపు ఎన్నికలు నిర్వహించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య వివాదం నెలకొన్నది. ఇందులో భాగంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించలేమంటూ తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిదేనంటూ ఇవాళ ఉదయం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఏపీ సర్కార్​ సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతున్నదని.. ఈ పరిస్థితిల్లో ఎన్నికలు నిర్వహించలేమంటూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్​ విన్నవించింది.

మరో వైపు కమిషనర్ నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలు జరిగి తీరుతాయని చెబుతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కమిషనర్ గతంలోనే ఎన్నికల షెడ్యూల్​ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ సర్కారు కోర్టుకు వెళ్లింది. సింగిల్​ బెంచ్​ న్యాయస్థానం ఎన్నికల షెడ్యూల్​ను కొట్టేసింది. దీంతో కమిషనర్​ అప్పీలుకు వెళ్లారు. గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

First Published:  21 Jan 2021 10:50 AM GMT
Next Story