Telugu Global
Cinema & Entertainment

4 రోజుల్లోనే లాభాల్లోకి రెడ్

రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా 4 రోజుల్లోనే లాభాల్లోకి వచ్చింది. ఇది మేం చెబుతున్న మాట కాదు. నిర్మాత స్రవంతి రవికిషోర్ చెబుతున్న మాట. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ లాభాలు ఎలా వచ్చాయనేది అందరి అనుమానం. దీనికి రవికిషోర్ చెబుతున్న లాజిక్ ఇలా ఉంది. “తొలి రోజు సినిమాకు రూ. 6.7 కోట్ల షేర్‌ వచ్చింది. రెండో రోజు రూ. 4.17 కోట్లు, మూడో రోజు రూ. 2.71 కోట్లు, నాలుగో రోజు రూ. […]

Sravanthi RaviKishore
X

రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా 4 రోజుల్లోనే లాభాల్లోకి వచ్చింది. ఇది మేం చెబుతున్న మాట కాదు. నిర్మాత స్రవంతి రవికిషోర్ చెబుతున్న మాట. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ లాభాలు ఎలా వచ్చాయనేది అందరి అనుమానం. దీనికి రవికిషోర్ చెబుతున్న లాజిక్ ఇలా ఉంది.

“తొలి రోజు సినిమాకు రూ. 6.7 కోట్ల షేర్‌ వచ్చింది. రెండో రోజు రూ. 4.17 కోట్లు, మూడో రోజు రూ. 2.71 కోట్లు, నాలుగో రోజు రూ. 2.26 కోట్ల షేర్‌ వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటంటే… మేజర్‌ ఏరియాలు కొన్నిటిలో మేం విడుదల చేసినప్పటికీ, మిగతా ఏరియాల్లో చాలా రీజనబుల్‌ రేటుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాం. కరోనాకి తోడు 50 శాతం ఆక్యుపెన్సీని దృష్టిలో పెట్టుకుని… మామూలు రేటు కంటే తక్కువ రేటుకు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఆ డబ్బులు కూడా వచ్చేశాయి. తక్కువ రేటుకు ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది ఏమీ జరగలేదు. మనకు వస్తాయనుకున్న డబ్బుల్లో కొంత తగ్గింది తప్పితే… నష్టపోయింది ఏమీ లేదు. వాళ్లు పెట్టిన పెట్టుబడి కొన్నిచోట్ల రెండో రోజు, కొన్ని చోట్ల మూడో రోజే తిరిగి వచ్చేసింది. పశ్చిమ గోదావరిలో రెండో రోజుకే బ్రేక్‌ ఈవెన్‌ అయింది. తూర్పు గోదావరిలో మూడో రోజు బ్రేక్‌ ఈవెన్‌ అయింది. నాలుగు రోజుల్లో అందరికీ లాభాలు వచ్చాయి.”

ఇలా రెడ్ సినిమాకు లాభాలు వచ్చాయంటున్నాడు నిర్మాత. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే, నిర్మాతలంతా కొంత లాభాలు తగ్గించుకోవాలని ఆయన అంటున్నారు.

First Published:  21 Jan 2021 1:41 PM IST
Next Story