Telugu Global
International

మొదలైన బైడెన్ శకం

అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. భార్య జిల్‌ బైడెన్‌తో కలిసి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బైబిల్‌పై ప్రమాణం చేసి దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు బైడెన్. అంతకు ముందు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా ఇండో ఆఫ్రోఅమెరికన్‌ మహిళ కమల […]

మొదలైన బైడెన్ శకం
X

అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. భార్య జిల్‌ బైడెన్‌తో కలిసి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బైబిల్‌పై ప్రమాణం చేసి దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు బైడెన్. అంతకు ముందు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా ఇండో ఆఫ్రోఅమెరికన్‌ మహిళ కమల హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ కమలా హ్యారిస్ తో ప్రమాణం చేయించారు. ట్రంప్‌ వైఖరి, కేపిటల్‌ భవనంపై ఆయన మద్దతుదారుల దాడి నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో వివక్షకు తావులేదని, ప్రజాస్వామ్యం బలంగా ఉన్నదని అన్నారు. తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడినని అన్నారు. అమెరికా ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అన్నారు. హింస, ఉగ్రవాదం, నిరుద్యోగం లాంటి సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. దేశాభివృద్ధికి అందరి చేయూత అవసరమని అన్నారు. కరోనా వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కరోనా నుంచి త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

నూతన అధ్యక్షుడి ప్రసంగ పాఠాన్ని తెలంగాణకు చెందిన వినయ్‌రెడ్డి రూపొందించడం విశేషం. అమెరికాలోనే పుట్టి పెరిగిన వినయ్‌రెడ్డి స్వస్థలం కరీంనగర్‌ జిల్లాలోని పోతిరెడ్డిపేట. వినయ్‌ తల్లిదండ్రులు 1970లో అమెరికాకు వలస వెళ్లారు. బైడెన్‌ స్పీచ్‌ రైటర్‌గా వినయ్‌రెడ్డి ఇటీవల నియమితులయ్యారు.

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన జో బైడెన్‌ తొలిరోజే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని బైడెన్ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే 15 కీలక ఆదేశాలపై బైడెన్ సంతకాలు చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ విరమించుకున్నారు. అమెరికా – పారిస్‌ వాతావరణ ఒప్పందంలో తిరిగి అమెరికా చేరననున్నట్లు నిర్ణయించారు. మెక్సికో గోడ నిర్మాణానికి నిధుల సమీకరణకు తీసుకొచ్చిన నేషనల్‌ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ను బైడెన్ నిలిపివేశారు. గ్రీన్‌ కార్డు జారీలో దేశాలకు పరిమితిని బైడెన్‌ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో పాటు ఎన్నో దేశాల వారికి ఉపశమనం కలగనుంది. అమెరికా అభివృద్ధిలో కీలకంగా గల వలసదారులకు శాశ్వత పౌరసత్వం, నివాసం కల్పిస్తూ బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్‌ గైర్హాజరు
నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పదవి నుంచి తప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ హాజరుకాలేదు. సంప్రదాయాన్ని తోసిపుచ్చి ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు. కాగా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్‌ బుష్, క్లింటన్‌ తమ సతీమణులతో కలిసి హాజరయ్యారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్‌ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు బడెన్ తో కలిసి పనిచేస్తామన్నారు.

First Published:  21 Jan 2021 5:09 AM IST
Next Story