Telugu Global
International

బైడెన్ ప్రసంగాలు రాసేది తెలంగాణ కుర్రాడే

అగ్రరాజ్యం అమెరికాలో అనేక మంది భారతీయులు పలు సంస్థల్లో కీలక స్థానాల్లో పని చేస్తున్నారు. ఇక భారతీయ మూలాలున్న వ్యక్తులు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. కమలా హారిస్ ఏకంగా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైంది. అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం వెనుక ఒక తెలంగాణ యువకుడు ఉండటం గమనార్హం. 2012 నుంచి డెమోక్రాట్ల కోసం స్పీచ్ రైటర్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తే వినయ్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన నారాయణ […]

బైడెన్ ప్రసంగాలు రాసేది తెలంగాణ కుర్రాడే
X

అగ్రరాజ్యం అమెరికాలో అనేక మంది భారతీయులు పలు సంస్థల్లో కీలక స్థానాల్లో పని చేస్తున్నారు. ఇక భారతీయ మూలాలున్న వ్యక్తులు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. కమలా హారిస్ ఏకంగా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైంది. అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం వెనుక ఒక తెలంగాణ యువకుడు ఉండటం గమనార్హం. 2012 నుంచి డెమోక్రాట్ల కోసం స్పీచ్ రైటర్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తే వినయ్ రెడ్డి.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన నారాయణ రెడ్డి 1970లో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకొని అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆయన కుమారుడే వినయ్ రెడ్డి. అమెరికాలోనే పుట్టిన వినయ్.. ఓహియో లా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం పట్టా పొందాడు. అనంతరం యూఎస్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, పర్యావరణ, మానవాభివృద్ధి శాఖలకు ప్రసంగాలను సిద్ధం చేసే స్పీచ్ రైటర్ గా వినయ్ రెడ్డి పని చేశారు.

వినయ్‌రెడ్డి ప్రతిభను గుర్తించిన ఒబామా.. తన రెండో టర్మ్ ఎన్నికల సమయంలో తన బృందంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఒబామా, ఉపాధ్యక్షుడిగా బైడెన్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. వారికి అవసరమైన ప్రసంగాలు రాస్తూ వారి నమ్మకాన్ని చురగొన్నాడు. దీంతో ఈ సారి మళ్లీ ఎన్నికల సమయంలో బైడెన్ తన బృందంలోకి వినయ్ రెడ్డిని తీసుకున్నారు. బైడెన్ స్పీచ్ రైటర్‌గా, కమలా హారిస్‌కు అనువాదకుడిగా పని చేశారు.

బైడెన్ ప్రసంగించిన ‘అమెరికా యునైటెడ్’ అనే పూర్తి పాఠాన్ని సిద్దం చేసింది వినయ్ రెడ్డే కావడం గమనార్హం.

First Published:  21 Jan 2021 12:14 AM GMT
Next Story