ఇక నేరుగా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన సంగతి తెలిసందే. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు నమోదు చేసుకున్న పేర్ల ఆధారంగా ఒక వ్యాక్సినేషన్ సెంటర్‌లో రోజుకు 100 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. co-WIN యాప్ ద్వారా ఏ రోజు ఎవరికి వ్యాక్సిన్ వేయాలో ఆయా సెంటర్ల వారికి ముందుగా తెలుస్తుంది. దాని ప్రకారమే యాప్‌లో చూపించిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. వారికి తప్ప ఎవరైనా […]
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన సంగతి తెలిసందే. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు నమోదు చేసుకున్న పేర్ల ఆధారంగా ఒక వ్యాక్సినేషన్ సెంటర్‌లో రోజుకు 100 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. co-WIN యాప్ ద్వారా ఏ రోజు ఎవరికి వ్యాక్సిన్ వేయాలో ఆయా సెంటర్ల వారికి ముందుగా తెలుస్తుంది. దాని ప్రకారమే యాప్‌లో చూపించిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. వారికి తప్ప ఎవరైనా నేరుగా కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్తే వారికి వ్యాక్సిన్ వేయడం లేదు. co-WIN యాప్‌లో అలాంటి ఆప్షన్ కూడా ఇప్పటి వరకు లేదు.
కాగా, తాజాగా co-WIN యాప్‌లో మార్పులు చేశారు. ఎవరైనా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళితే అప్పటికప్పుడు యాప్‌లో పేరు నమోదు చేసి వ్యాక్సిన్ ఇచ్చేలా రీడిజైన్ చేశారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వాళ్లు చాలా మంది ఆయా కేంద్రాలకు రావడం లేదు. దీంతో 100 మంది కంటే తక్కువ మందికి వ్యాక్సినేషన్ జరుగుతున్నది. మిగిలిన వ్యాక్సిన్ వాయిల్స్ తిరిగి వెనక్కు పంపాల్సి వస్తున్నది. అందుకే అప్పటికప్పుడు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చి.. వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
నమోదు చేసుకున్న తేదీన రాని వాళ్లు.. లేదా వ్యాక్సినేషన్ తేదీ మార్చుకోవాలనుకునే వాళ్లు ముందుగా సిబ్బందికి తెలియజేస్తే ఆ ప్రకారం co-WINయాప్‌లో మార్పులు చేస్తారు. కాగా ఈ యాప్‌లో మొదటి నుంచి పలు సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యాక్సినేషన్ సెంటర్‌లో ఉండే సిబ్బంది ఒక్కోసారి యాప్ సమస్యలనుఅధిగమించలేక పోతున్నారు. ఇదే విషయాన్ని కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఎంపవర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు.
‘యాప్‌ను అతి తక్కువ సమయంలో తయారు చేశారు. యాప్ అన్న తర్వాత కొన్ని సమస్యలు వస్తుంటాయి. దాన్ని వినియోగించే క్రమంలోనే సమస్యలు బయటపడతాయి. ఒకేసారి కోట్లాది మంది పేర్లను నమోదు చేసి.. దాని ప్రకారం వ్యాక్సినేషన్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. కేవలం డ్రై రన్ సమయంలో మాత్రమే co-WIN యాప్ పని తీరు పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా వినియోగంలోకి వచ్చింది. కానీ టెక్నికల్ టీమ్ ఎప్పటికప్పడు యాప్ తీరును మెరుగుపరుస్తున్నది. కానీ ఇది పెద్ద సమస్య కాదు. త్వరలోనే రోజుకు వంద నుంచి మరింత మందికి వ్యాక్సిన్ అందించేలా యాప్‌ను అప్‌గ్రేడ్ చేస్తారు.’ అని డాక్టర్ శర్మ తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.