Telugu Global
NEWS

గంటా ఇంతకూ ఏ పార్టీలో ఉన్నారు?

ఆంధ్రప్రదేశ్​ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ గంటా శ్రీనివాసరావు మాత్రం గెలుపొందారు. అయితే ఆయన ఎన్నికల తర్వాత టీడీపీ అగ్రనేతలకు అస్సలు టచ్​లో లేరు. ఆయన వైసీపీలో చేరతారని చాలా కాలం వార్తలు వచ్చాయి. అయితే వైసీపీలో ఉన్న సీనియర్లు ఆయన రాకను అడ్డుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. అందుకు కారణం ఆయన టీడీపీ సమావేశాల్లో పాల్గొనడం లేదు. గంటా […]

గంటా ఇంతకూ ఏ పార్టీలో ఉన్నారు?
X

ఆంధ్రప్రదేశ్​ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ గంటా శ్రీనివాసరావు మాత్రం గెలుపొందారు. అయితే ఆయన ఎన్నికల తర్వాత టీడీపీ అగ్రనేతలకు అస్సలు టచ్​లో లేరు. ఆయన వైసీపీలో చేరతారని చాలా కాలం వార్తలు వచ్చాయి. అయితే వైసీపీలో ఉన్న సీనియర్లు ఆయన రాకను అడ్డుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. అందుకు కారణం ఆయన టీడీపీ సమావేశాల్లో పాల్గొనడం లేదు.

గంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంలేదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆయన ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టారు. దీంతో ఆయన ఏ పార్టీలో ఉన్నారో? అర్థం కావడం లేదు. ఇదే ప్రశ్న గంటాను అడిగినప్పుడు.. ‘తాను పార్టీ మారితే ముందుకు మీడియాకు చెబుతాను’ అంటారాయన.

అయితే గంటా వ్యూహాలు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. సోమవారం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్​ వర్ధంతి జరిగిన విషయం తెలిసిందే. గంటా శ్రీనివాసరావు ఎన్టీఆర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్​ తనకు ఎంతో ఆరాధ్యుడని పేర్కొన్నారు.

అయితే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొనలేదు. పార్టీ ఆఫీసులో నిర్వహించిన రక్తదాన శిబిరంలోనూ పాల్గొనలేదు. దీంతో గంటా ఏ పార్టీలో ఉన్నారు? అన్న విషయం చర్చనీయాంశం అయ్యింది. ఆయన బీజేపీలో చేరొచ్చంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆయనకు మాత్రం వైసీపీలో చేరాలని ఉంది. అయితే అందుకు ఆ పార్టీలోని సీనియర్లు కొందరు అడ్డుతగులుతున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా సీఎం జగన్​మోహన్​రెడ్డిని కలుసుకొని తన మనసులోని మాటను బయటపెట్టాలని ఆయన చూస్తున్నారట.

First Published:  20 Jan 2021 6:19 AM IST
Next Story