Telugu Global
Cinema & Entertainment

మొన్న పవన్.. ఈసారి చిరంజీవి

అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. పవన్ సినిమాకు ఫస్ట్ టైమ్ మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు. వకీల్ సాబ్ కు సంగీతం అందిస్తున్న టైమ్ లోనే, పవన్ మరో సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ కు సంగీతం అందించే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాకు సంగీతం అందించబోతున్నాడు ఈ మ్యూజిక్ డైరక్టర్. చిరంజీవి హీరోగా రాబోతున్న లూసిఫర్ రీమేక్ కు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ […]

మొన్న పవన్.. ఈసారి చిరంజీవి
X

అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్.
పవన్ సినిమాకు ఫస్ట్ టైమ్ మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు. వకీల్ సాబ్ కు సంగీతం
అందిస్తున్న టైమ్ లోనే, పవన్ మరో సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ కు సంగీతం అందించే అవకాశం
కూడా దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాకు సంగీతం అందించబోతున్నాడు ఈ
మ్యూజిక్ డైరక్టర్.

చిరంజీవి హీరోగా రాబోతున్న లూసిఫర్ రీమేక్ కు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ మేరకు
యూనిట్ నుంచి ప్రకటన వచ్చేసింది. మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంగీతం
అందించే ఛాన్స్ తమన్ కు దక్కింది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ తమన్, ఇలా చిరంజీవి సినిమాకు సంగీతం
అందిస్తున్నాడు. బాస్ సినిమాకు ది బెస్ట్ ఇస్తానంటున్నాడు తమన్

ఇక లూసిఫర్ విశేషాలకొస్తే.. ఈ సినిమా కోసం ఇప్పటికే సత్యదేవ్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు.
ముందుగా వరుణ్ తేజ్ లేదా సాయితేజ్ కోసం అనుకున్న పాత్ర ఇది. కానీ సత్యదేవ్ ను తీసుకున్నారు.
ఇక మరో కీలక పాత్రలో నయనతారను తీసుకున్నారు. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా మొదలైంది.

First Published:  20 Jan 2021 11:40 AM IST
Next Story