Telugu Global
National

మమత పోటీచేస్తే 50 వేల ఆధిక్యంతో గెలుస్తా: సువెందు అధికారి సవాల్

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్​లో రాజకీయాలు వేడెక్కాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొలిటికల్​ హీట్​ రాజుకుంది. తృణమూల్​ కాంగ్రెస్​కు చెందిన కీలక నేత సువెందు అధికారి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే గతంలో సువెందు అధికారి టీఎంసీలో కీలకంగా వ్యవహరించేవారు. ఆయన సొంత నియోజకవర్గం నందిగ్రామ్​. తృణమూల్​ రాజకీయ ఉనికికి కూడా నందిగ్రామ్​ ఉద్యమం ఎంతో ఉపయోగపడింది. అయితే సోమవారం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్​ నుంచి […]

మమత పోటీచేస్తే 50 వేల ఆధిక్యంతో గెలుస్తా: సువెందు అధికారి సవాల్
X

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్​లో రాజకీయాలు వేడెక్కాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొలిటికల్​ హీట్​ రాజుకుంది. తృణమూల్​ కాంగ్రెస్​కు చెందిన కీలక నేత సువెందు అధికారి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే గతంలో సువెందు అధికారి టీఎంసీలో కీలకంగా వ్యవహరించేవారు. ఆయన సొంత నియోజకవర్గం నందిగ్రామ్​. తృణమూల్​ రాజకీయ ఉనికికి కూడా నందిగ్రామ్​ ఉద్యమం ఎంతో ఉపయోగపడింది. అయితే సోమవారం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్​ నుంచి పోటీచేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది.

మమతా బెనర్జీ ప్రకటనపై బీజేపీ నేత సువెందు అధికారి స్పందించారు. ‘ఒకవేళ మమతా బెనర్జీ నందిగ్రామ్​లో పోటీచేస్తే.. ఆమెపై నేను 50 వేల ఆధిక్యంతో గెలుస్తా. ఒక వేళ ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలనుంచి వైదొలుగుతా’ అంటూ సువేందు అధికారి సవాల్​ విసిరారు. దీంతో బెంగాల్​లో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం రసవత్తరంగా మారింది.

కోల్‌కతాలో జరిగిన ఓ ర్యాలీలో సుబేందు పై వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘తృణమూల్​ కాంగ్రెస్​ రాజకీయపార్టీ కాదు. ఓ ప్రైవేట్​ సంస్థలా మారిపోయింది. అందుకే పక్కరాష్ట్రం నుంచి ప్రశాంత్​కిశోర్​ను తెచ్చిపెట్టుకున్నారు. దీన్ని బట్టే అర్థమైపోతుంది ఆ పార్టీ నేతలు బీజేపీ అంటే ఎంతలా భయపడిపోతున్నారో’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కాగా నిన్న కోల్​కతాలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీపై గుర్తుతెలియని దుండగులు రాళ్లు విసిరారు. ఇది టీఎంసీ కార్యకర్తల పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

First Published:  19 Jan 2021 3:18 AM IST
Next Story