అటుఇటు తిరిగి అదే టైటిల్
టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ, ఇటీవలే ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ సాధించిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `లైగర్`తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు `లైగర్` మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌పోస్టర్‌ను అధికారికంగా విడుదలచేశారు మేకర్స్. పూరి కనెక్ట్స్‌తో కలిసి, బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. విజయ్‌దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే నటిస్తోంది. […]
టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ, ఇటీవలే ఇస్మార్ట్
శంకర్‌తో బ్లాక్‌బస్టర్ సాధించిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్
'లైగర్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు 'లైగర్' మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌పోస్టర్‌ను
అధికారికంగా విడుదలచేశారు మేకర్స్.
పూరి కనెక్ట్స్‌తో కలిసి, బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న
సినిమా ఇది. విజయ్‌దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే నటిస్తోంది.
'లైగర్ 'టైటిల్‌తో పాటు 'సాలా క్రాస్‌బ్రీడ్' అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్నఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్‌దేవరకొండ
పొడవాటి జుట్టు, చేతికి గ్లౌవ్స్‌తో మార్షల్ ఆర్టిస్ట్‌లా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సింహం మరియు పులి
యొక్క మిశ్రమ రూపం ఉంది. టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ 'లైగర్'.
తన హీరోలను పూర్తిగా భిన్నమైన అవతారాలలో చూపించే పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండను
ఇంతవరకూ చూడని డిఫరెంట్ లుక్‌తో ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ తన
ఇంటెన్స్ లుక్, పొడవాటి జుట్టుతో ఆకట్టుకున్నాడు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ
భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.