నితిన్ దర్శకుడితో రామ్
హీరో రామ్ డ్యూయల్ రోల్ చేసిన థ్రిల్లర్ సినిమా రెడ్, థియేటర్స్ లో సందడి చేస్తోంది. అది రిలీజై ఇన్ని రోజులైనా ఇప్పటివరకు తన కొత్త సినిమా ప్రకటించలేదు రామ్. తాజా సమాచారం ప్రకారం గతేడాది నితిన్ తో ‘భీష్మ’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తో రామ్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గా రామ్-వెంకీ కుడుముల మధ్య స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయట. ఫస్ట్ సిట్టింగ్ లోనే రామ్ […]
హీరో రామ్ డ్యూయల్ రోల్ చేసిన థ్రిల్లర్ సినిమా రెడ్, థియేటర్స్ లో సందడి చేస్తోంది. అది రిలీజై ఇన్ని
రోజులైనా ఇప్పటివరకు తన కొత్త సినిమా ప్రకటించలేదు రామ్. తాజా సమాచారం ప్రకారం గతేడాది నితిన్
తో ‘భీష్మ’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తో రామ్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.
రీసెంట్ గా రామ్-వెంకీ కుడుముల మధ్య స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయట. ఫస్ట్ సిట్టింగ్ లోనే రామ్ నుంచి
గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట వెంకీ కుడుమల.
రామ్ నెక్స్ట్ లిస్టులో తమిళ్ డైరెక్టర్ నేసన్ పేరు కూడా ఉంది. రామ్ కి నేసన్ ఓ యాక్షన్ డ్రామా కథ
చెప్పి లాక్ చేసుకున్నాడు. మరి రామ్ ముందుగా వెంకీ కుడుముల తో సినిమా చేస్తాడా లేదా నేసన్ కి
ఛాన్స్ ఇస్తాడా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరికొన్ని రోజుల్లో రామ్ కొత్త
సినిమాపై ఓ క్లారిటీ రానుంది.