సామాజిక మాద్యమాలపై కేంద్రం నజర్
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై నేపథ్యంలో సామాజిక మాద్యమాలపై దృష్టిసారించింది కేంద్రం. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫేస్‌బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, డిజిటల్ మాధ్యమాల్లో మహిళల భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 21న సమావేశం కావాలని ఆదేశించింది. వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీ విధానంపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వివాదం నేపథ్యంలో […]
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై నేపథ్యంలో సామాజిక మాద్యమాలపై దృష్టిసారించింది కేంద్రం. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫేస్‌బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, డిజిటల్ మాధ్యమాల్లో మహిళల భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 21న సమావేశం కావాలని ఆదేశించింది. వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీ విధానంపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వివాదం నేపథ్యంలో నిన్న సమావేశమైన పార్లమెంటు సమాచార, సాంకేతిక స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల తన ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది. ఫిబ్రవరి 8లోపు వినియోగదారులు కొత్త నిబంధనలు అంగీకరించాలని, లేదంటూ వాట్సప్ వినియోగించలేరంటూ సూచించింది. కాగా.. కొత్త ప్రైవసీ పాలసీపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ప్రైవసీ పాలసీ అమలును మూడు నెలల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కోట్లాది మంది వినియోగదారులు ప్రత్యా్మ్నాయ యాప్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సామాజిక మాద్యమాలపై దృష్టి కేంద్రీకరించింది.
గత కొంతకాలంగా సామాజిక మాద్యమాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్ బుక్ లాంటి మాద్యమాలు రాజకీయ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం దేశంలో రాజకీయ దుమారానికి కారణమైంది. తాజాగా.. వాట్సప్ అప్ డేట్ చేసిన ప్రైవసీ పాలసీతో మరోమారు సామాజిక మాద్యమాల పనితీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల సమాచారాన్ని ఇతర దేశాలకు విక్రయిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రతినిధులు ఈనెల 21వ కమిటీ ముందు హాజరుకావాలంటూ సమన్లు పంపింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ చర్చించనుంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో పౌరుల హక్కుల రక్షణ, మహిళల భద్రత గురించి సమావేశం చర్చించనుంది. దేశ వ్యాప్తంగా సామాజిక మాద్యమాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహించనున్న ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది.