Telugu Global
NEWS

భూమా ఫ్యామిలీకి మరో షాక్‌ !

కిడ్నాప్‌ కేసులో ఇరుక్కున్న భూమా ఫ్యామిలీ కష్ఠాల్లో పడింది. అఖిలప్రియ జైలులో ఉంటే…ఆమె భర్త భార్గవ్‌రామ్‌ పరారీలో ఉన్నారు. తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి కనిపించడం లేదు. చెల్లి మౌనికారెడ్డి ఆళ్లగడ్డ టు హైదరాబాద్‌ తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. ఇలాంటి టైమ్‌లో రాజకీయంగా కూడా వారికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 25 ఏళ్లుగా విజయ డెయిరీ ఛైర్మన్‌ పదవి కాపాడుకుంటున్న భూమా వర్గానికి ఈసారి దక్కే చాన్స్‌ కనిపించడం లేదు. ఎప్పుడూ పోటీనే […]

భూమా ఫ్యామిలీకి మరో షాక్‌ !
X

కిడ్నాప్‌ కేసులో ఇరుక్కున్న భూమా ఫ్యామిలీ కష్ఠాల్లో పడింది. అఖిలప్రియ జైలులో ఉంటే…ఆమె భర్త భార్గవ్‌రామ్‌ పరారీలో ఉన్నారు. తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి కనిపించడం లేదు. చెల్లి మౌనికారెడ్డి ఆళ్లగడ్డ టు హైదరాబాద్‌ తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. ఇలాంటి టైమ్‌లో రాజకీయంగా కూడా వారికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

25 ఏళ్లుగా విజయ డెయిరీ ఛైర్మన్‌ పదవి కాపాడుకుంటున్న భూమా వర్గానికి ఈసారి దక్కే చాన్స్‌ కనిపించడం లేదు. ఎప్పుడూ పోటీనే లేకుండా ఏకగ్రీవంగా ఇన్నాళ్లు . భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణరెడ్డి గెలుస్తున్నారు. ఆయన ఆధిపత్యమే డెయిరీలో నడుస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ జైలులో ఉండటం.. ప్రత్యర్థి వైపు నుంచి గట్టి అభ్యర్థి పోటీలో ఉండటంతో ఈసారి భూమా కుటుంబానికి ఓటమి తప్పేట్లు లేదు. అఖిలప్రియ మేనమామ, శోభా నాగిరెడ్డి తమ్ముడు ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌ కావాలని చూస్తున్నారు. డైయిరీ ఛైర్మన్‌గా ఎస్వీ జగన్ కావాల్సిందేనని ఇటీవల కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు సూచించారు ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలో భూమా ఫ్యామిలీకి ఈసారి ఓటమి తప్పదని తెలుస్తోంది.

140 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డెయిరీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అటు భూమా ఇటు ఎస్వీ కుటుంబాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నంద్యాల రాజకీయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే మూడు డైరెక్టర్ల పోస్టులకు, చైర్మన్ పదవికి నామినేషన్లు జరిగాయి.

First Published:  18 Jan 2021 9:36 AM GMT
Next Story