Telugu Global
Cinema & Entertainment

పని పూర్తిచేసిన పూజా హెగ్డే

రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ను పూర్తిచేసిన పూజా హెగ్డే, తాజాగా మరో సినిమాను కూడా కంప్లీట్ చేసింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి పూజా హెగ్డే పోర్షన్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఈ హీరోయిన్, ముంబయికి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. బాలీవుడ్ లో 2 సినిమాలకు కమిట్ అయింది పూజా హెగ్డే. వీటిలో ఓ సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి. కానీ రాధేశ్యామ్ […]

pooja hegde radhe shyam
X

రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ను పూర్తిచేసిన పూజా హెగ్డే, తాజాగా మరో సినిమాను కూడా కంప్లీట్ చేసింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి పూజా హెగ్డే పోర్షన్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఈ హీరోయిన్, ముంబయికి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది.

బాలీవుడ్ లో 2 సినిమాలకు కమిట్ అయింది పూజా హెగ్డే. వీటిలో ఓ సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి. కానీ రాధేశ్యామ్ మూవీ చాన్నాళ్లుగా వాయిదా పడుతున్న కారణంగా, ముందుగా ఆ సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశంతో బాలీవుడ్ మూవీని పక్కనపెట్టింది. ఇప్పుడు రాధేశ్యామ్ కంప్లీట్ అవ్వడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముంబయి వెళ్లింది ఈ బ్యూటీ.

ఇక రాధేశ్యామ్ అప్ డేట్స్ విషయానికొస్తే… ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన యూరోప్ సెట్ లో ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది.

First Published:  17 Jan 2021 11:21 AM IST
Next Story